FB post
-
శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటికి బెయిల్..
Marathi Actress Ketaki Chitale Got Bail Over Post Against Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌ను అవమానకర రీతిలో ప్రస్తావించిందన్న ఆరోపణలో అరెస్టయిన 29 ఏళ్ల మరాఠీ నటి కేతకి చితాలేకు తాజాగా బెయిల్ మంజూరైంది. సోషల్ మీడియా ఫేస్బుక్లో శరద్‌పై అభ్యంతకర పోస్టులు చేసిందన్న కారణంగా కేతకిని మే 14న థానే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన దాదాపు నెల రోజుల తర్వాత మహారాష్ట్ర థానే జిల్లాలోని కోర్టు బుధవారం (జూన్ 22) బెయిల్ జారీ చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చారు జిల్లా న్యాయమూర్తి హెచ్ఎం పట్వర్దన్. ఇప్పుడు కేతకి థానే సెంట్రల్ జైల నుంచి ఇంటికి వెళ్లవచ్చని ఆమె తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కేతకిపై ఐపీసీ సెక్షన్ 505 (2) (ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం), 500 (పరువు నష్టం), 501 (పరువు నష్టం కలిగించే విషయాన్ని ముద్రించడం, ప్రస్తావించడం), 153 ఏ మతం, జాతి, స్థలం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం వంటి కేసులు నమోదయ్యాయి. శరద్ పవార్‌పై అనుచిత పోస్టులు పెట్టిందన్న ఆరోపణలతో నటి కేతకి చితాలే ప్రస్తుతం సుమారు 20కుపైగా ఫిర్యాదులను ఎదుర్కొంటోంది. ఈ కేసు విషయమై పోలీసుల అదుపులో ఉన్నప్పుడు కేతకి చితాలేపై సిరా చుక్కలు చల్లి నిరసన తెలియజేశారు. చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్ -
ఎంపీ భార్య వేసిన ఆ జోక్ చెత్తగా ఉంది!
తిరువనంతపురం: కేరళలోని ఎర్నాకులం ఎంపీ హిబీ ఈడెన్ భార్య ఫేస్బుక్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పెద్ద ఎత్తున వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. విధిని అత్యచారంతో పోలుస్తూ.. మంగళవారం ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపాయి. ‘విధి అత్యాచారం వంటిది, మీరు దానిని అడ్డుకోలేకపోతే.. ఆస్వాదించడానికి ప్రయత్నించండి' అంటూ ఆమె వేసిన జోక్ చెత్తగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ పోస్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎంపీ భార్య తన వివాదాస్పద పోస్టును తొలగించారు. అంతేగాక తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. మలయాళంలో క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకులం ఎంపీ భార్య అన్నా లిండా ఈడెన్.. కుండపోత వర్షాలు కొచ్చిని ముంచెత్తుతున్న తరుణంలో తమ పిల్లాడు ఇంట్లో సురక్షితంగా ఉన్నాడన్న వీడియోతో పాటు.. భర్త హిబీ ఈడెన్ డెజర్ట్ ఆస్వాదిస్తున్న వీడియోలను పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్‌లకు ఆమె జత చేసిన వ్యాఖ్యలతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలో అన్నా చేసిన పోస్టుకు స్పందించిన నెటిజన్లు.. రేప్ జోక్‌లు వద్దని, ఇటువంటి వ్యాఖ్యలు అత్యాచార బాధితులు, వారి కుటుంబాలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని చురకలు అంటించారు. దీంతో తన పోస్టును వెనక్కు తీసుకున్న ఆమె.. ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తాను చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. -
మోదీపై అభ్యంతరకర పోస్ట్ : విద్యార్థి అరెస్ట్
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీపై ఫేస్బుక్ పేజ్‌లో అభ్యంతరకర పోస్టర్‌ను ప్రదర్శించిన అలీగఢ్ ముస్లిం వర్సిటీ (ఏఎంయూ) విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జరిగిన నిరసనలకు సంబంధించిన ఓ పోస్టర్‌ను ఎఫ్బీలో పోస్ట్ చేసిన ఏఎంయూ విద్యార్థి మహ్మద్ జైద్ రషీద్ (20)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రషీద్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు ఏఎంయూ పూర్వ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్సిటీ అధికారులు, పోలీసులు ఈ ఉదంతంపై ఆరా తీయగా సదరు విద్యార్థి బిహార్‌లోని వర్సిటీ స్టడీ సెంటర్లో ఇటీవల అడ్మిషన్ తీసుకున్నట్టు వెల్లడైంది. అలీగఢ్ క్యాంపస్‌తో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ఏఎంయూ ప్రతినిధి షైఫీ కిద్వాయ్ స్పష్టం చేశారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే దీనిపై తాము తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, నిందితుడిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని సీనియర్ ఎస్పీ ఆకాష్ కుల్హరి తెలిపారు. -
మనసులు మాత్రం!
సాక్షి, చెన్నై : ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. మనసులు మాత్రం..!’ అంటూ పన్నీరు మద్దతు ఎంపీ మైత్రేయన్ వ్యాఖ్యలు అన్నాడీఎంకే సర్కారులో మంగళవారం హాట్ టాపిక్‌గా మారింది. పన్నీరు మదిలో మాట ఇదేనా..! తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మైత్రేయన్ అసంతృప్తి గళాన్ని వినిపించే పనిలో పడ్డారా..? అన్న చర్చ ఊపందుకుంది. చిన్నమ్మ శశికళకు వ్యతిరేకంగా తిరుగు బావుటా ఎగురవేసిన మాజీ సీఎం పన్నీరు సెల్వం తనబలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించి చతికిలపడ్డారు. ఎట్టకేలకు చిన్నమ్మ జైలుకు వెళ్లడం, సీఎం పళనిస్వామి బలం పెరగడం వెరసి విలీన బాటసాగింది. పళని, పన్నీరులు ఏకం అయ్యారు. సీఎంగా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీరుల పయనం ప్రస్తుతం సాగుతోంది. అయితే, పన్నీరు శిబిరం మాత్రం అసంతృప్తితోనే ఉందని చెప్పవచ్చు. ఆయన మద్దతు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పార్టీ పరంగా గానీ, ప్రభుత్వ పరంగా గానీ న్యాయం జరిగి ఉంటే ఒట్టు. అదే సమయంలో పన్నీరు అధికారాల్ని పీకి, కేవలం పదవిని మాత్రం కట్టబెట్టి ఉన్నారన్న ఆరోపణలున్నాయి. సీఎం పళనిస్వామి బలం మాత్రం రోజురోజుకు ఢిల్లీ స్థాయిలో పెరుగుతున్నా, పన్నీరు మాత్రం పతనం అవుతున్నారన్న ఆందోళన మద్దతు దారుల్లో ఉందని చెప్పవచ్చు. నమ్మి వచ్చిన వారికి న్యాయం చేయలేని పరిస్థితిలో డిప్యూటీ అన్న పదవిని అలంకార ప్రాయంగా పన్నీరు కల్గి ఉండడం ఆయన మద్దతుదారుల్లో అసంతృప్తిని రగుల్చుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఆయన మద్దతుదారులు సీఎం కార్యక్రమాన్ని బహిష్కరించే పనిలో పడ్డారు. మైత్రేయన్ ట్వీట్‌పై చర్చ సీఎం, డిప్యూటీలు ఒకే వేదిక మీద కనిపిస్తున్నా, మద్దతుదారులు మాత్రం వేర్వేరుగా పయనం సాగిస్తుండడంతో ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న చర్చ సాగుతోంది. ఈనేపథ్యంలో పన్నీరుకు అత్యంత సన్నిహితుడిగా, శశికళకు వ్యతిరేకంగా తిరుగుబాటు సాగిన క్రమంలో కీలక పాత్ర పోషించిన ఎంపీ మైత్రేయన్ మంగళవారం చేసిన ట్విట్ చర్చకు దారితీసింది. ఇరు శిబిరాలు విలీనమై మూడు నెలలు ముగిసి, నాలుగో నేల మంగళవారంతో అడుగు పెట్టినట్టు గుర్తుచేశారు. ‘విలీన ప్రక్రియ జరిగి కాలం గడుస్తున్నా.. అంటూ, మనస్సులు..? మాత్రం..!’ అన్న ప్రశ్నార్థకం, ఆశ్చర్యకర అర్థాలతో చర్చకు తెరలేపడం గమనార్హం. పన్నీరు మదిలో మాటను ఆయన బయట పెట్టారా..? లేదా, సాగుతున్న పరిణామాల నేపథ్యంలో అసంతృప్తిని వెల్లగక్కే విధంగా స్పందించారా..? అన్నచర్చ బయలు దేరింది. అసలే దినకరన్ రూపంలో అన్నాడీఎంకేలో పరిస్థితులు గందరగోళంగా సాగుతుంటే, మైత్రేయన్ వ్యాఖ్యలు కేడర్‌ను మరింత విస్మయంలోకి నెట్టాయి. అదే సమయంలో అమ్మ జయలలితకు వెన్నంటి నీడలా ఉన్న జయ టీవీ మీద ఐటీ దాడుల్ని కేడర్ మరవక ముందే, తాజాగా, ఆ చానల్లో డీఎంకే సీనియర్ నేత దురై మురుగన్‌తో ప్రత్యేక ఇంటర్వూ్య సాగడాన్ని అన్నాడీఎంకే కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. -
ఫేస్బుక్ పోస్ట్.. ఐఏఎస్‌పై వేటు
రాయ్ పూర్: బీజేపీ సిద్ధాంతకర్త, జనసంఘ్ నాయకుడు దీన్‌దయాల్ ఉపాధ్యాయపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు ఓ ఐఏఎస్ అధికారిపై బదిలీవేటు పడింది. జార్ఖండ్ లోని కాంకర్ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న 2002 ఐఏఎస్ బ్యాచ్ అధికారి శివ్ అనంత్ తయల్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనికి షోకాజ్ నోటీసును సైతం జారీ చేసింది. దేశానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ చేసిందేమిటని, ఆయన ఎప్పుడూ కూడా చెప్పుకోదగిన ఒక్క ఓటు మోజారిటీతో కూడా గెలవలేదని రచయిత రామచంద్ర గుహ రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ తయల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం దీన్‌దయాల్ జయతుత్సవాలను నిర్వహించదలచిన విషయం తెలిసిందే. కాగా తాను ఎవరినీ కించపరిచేందుకు ఈ పోస్ట్ చేయలేదని ఎవరిమనోభావాలైనా గాయపడితే అందుకు చింతిస్తున్నానని తయల్ వివరణయిచ్చారు.