ఫేస్బుక్ పోస్ట్.. ఐఏఎస్పై వేటు | Chhattisgarh IAS officer transferred over FB post | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్ పోస్ట్.. ఐఏఎస్పై వేటు

Published Sun, Oct 9 2016 11:33 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

ఫేస్బుక్ పోస్ట్.. ఐఏఎస్పై వేటు

ఫేస్బుక్ పోస్ట్.. ఐఏఎస్పై వేటు

రాయ్ పూర్: బీజేపీ సిద్ధాంతకర్త, జనసంఘ్ నాయకుడు దీన్దయాల్ ఉపాధ్యాయపై ఫేస్బుక్లో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేసినందుకు ఓ ఐఏఎస్ అధికారిపై బదిలీవేటు పడింది. జార్ఖండ్ లోని కాంకర్ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న 2002 ఐఏఎస్ బ్యాచ్ అధికారి శివ్ అనంత్ తయల్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతనికి షోకాజ్ నోటీసును సైతం జారీ చేసింది.

దేశానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ చేసిందేమిటని, ఆయన ఎప్పుడూ కూడా చెప్పుకోదగిన ఒక్క ఓటు మోజారిటీతో కూడా గెలవలేదని రచయిత రామచంద్ర గుహ రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను ఉటంకిస్తూ తయల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం దీన్దయాల్ జయతుత్సవాలను నిర్వహించదలచిన విషయం తెలిసిందే. కాగా తాను ఎవరినీ కించపరిచేందుకు ఈ పోస్ట్ చేయలేదని ఎవరిమనోభావాలైనా గాయపడితే అందుకు చింతిస్తున్నానని తయల్ వివరణయిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement