ముంబయి: అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీలో చీలిక వచ్చిన తర్వాత శరద్ పవార్ ముఖ్య అనుచరుడు ప్రపుల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష కూటమి అనే అంశం నవ్వు తెప్పించే విషయమని అన్నారు. శరద్ పవార్‌తో కలిసి తాను కూడా ఆ మీటింగ్‌కు హాజరయ్యానని చెప్పిన ప్రపుల్ పటేల్.. అక్కడి దృశ్యాలు గుర్తొస్తే నవ్వొస్తుందని చెప్పారు.
'అక్కడ 17 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. అందులో 7 పార్టీలకు ఒక్క ఎంపీ మాత్రమే ఉన్నారు. ఓ పార్టీకైతే ఒక్కరు కూడా లేరు. అలాంటివారందరూ కలిసి దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు' అని ప్రపుల్ పటేల్ ఎద‍్దేవా చేశారు. అజిత్ పవార్ నేతృత్వంలో ముంబయిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.
దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలిపినట్లు ప్రపుల్ పటేల్ తెలిపారు. శివ సేన భావాజాలాన్ని అంగీకరించినప్పుడు బీజేపీతో కలిస్తే తప్పేంటి?. జమ్మూ కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అలాంటి వారందరూ ప్రతిపక్ష కూటమి అంటూ ఒకచోటుకు వస్తున్నారని ప్రపుల్ పటేల్ చెప్పారు.
నేడు ఎన్సీపీలో ఇరువర్గాల మధ్య బల ప‍్రదర్శన జరిగింది. ఇందులో అజిత్ పవార్ 30 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోగా.. శరద్ పవార్ వెనుక కేవలం 17 మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: ‘బీజేపీతో పొత్తు కోసం ఆయనే యత్నించారు.. రాజీనామా డ్రామాలు ఆడారు!
Comments
Please login to add a commentAdd a comment