
శివసేన చీఫ్‌కు శరద్ పవార్ ప్రశంసలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాజకీయ సమీకరణాలు మారొచ్చన్న సంకేతాల నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రేను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశంసల్లో ముంచెత్తారు. శివసేన వ్యవస్థాపకుడైన తండ్రి బాల్‌ఠాక్రే 2012లో కన్నుమూశాక పార్టీని బలోపేతం చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా శ్రమిస్తున్నారని కితాబిచ్చారు.
ఆదివారం ముంబైలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బాల్‌ఠాక్రే మరణంతో శివసేన భవిష్యత్తుపై మీడియా అనవసరంగా సిరాను వృథా చేసిందని...కానీ మీడియా అంచనాలను ఉద్ధవ్‌ఠాక్రే తన పనితీరుతో తప్పని నిరూపించారన్నారు. అంచనాలకు మించి పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకా కృషి చేస్తున్నారన్నారు.