ముంబై: తన ఫోటోను తిరుగుబాటు నేత అజిత్ పవార్ ఉపయోగించడంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ.. తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫోటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు.
తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ అనే వర్గం మాత్రమే తన ఫోటోను ఉపయోగించుకోవాలన్నారు. తన ఫోటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనదేనని, తన అనుమతి తప్పనిసరి అన్నారు.
అజిత్ పవార్, పార్టీకి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరిన రెండురోజుల తర్వాత పవార్ ఈ ప్రకటన చేశారు. అజిత్ పవార్ మంగళవారం తమ వర్గానికి కొత్తగా ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పార్టీ కార్యాలయంలో శరద్ పవార్ ఫోటో కనిపించింది.
అయితే ఆ పార్టీ కార్యాలయం తాళం చేతులు లేకపోవడంతో పెద్ద హైడ్రామానే నడిచింది అక్కడ. ఇక.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ చీలిక వర్గం.. లోక్‌సభ ఎంపీ సునీల్ తట్కరేని ఎన్సీపీ రాష్ట్ర శాఖ చీఫ్‌గా ఉంటారని ప్రకటించడం గమనార్హం.
ఇదీ చదవండి: కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment