ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన విషయం తెలిసిందే. 600కు పైగా కార్లతో హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సోలాపూర్ వరకు భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లారు. తాజాగా కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోని పండరీపూర్‌కు కేసీఆర్ రావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తన బలాన్ని చూపించుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం ఆందోళనకరమని పేర్కొన్నారు.
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి వచ్చి ఆలయాలను దర్శించుకునేందుకు వస్తే అందుకు తాము అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే భారీ సంఖ్యలో వాహనాలను తీసుకొచ్చి తమ బాలన్ని చూపించుకునేందుకు చేసిన ప్రయత్నమే ఆందోళన కలిగిస్తోందన్నారు. దాని కంటే కేసీఆర్ తన పర్యటనలో రెండు రాష్ట్రాల మధ్య(తెలంగాణ-మహారాష్ట్ర) సహకారాన్ని పెంచడంపై దృష్టి పెడితే బాగుండేదని అన్నారు.
చదవండి: కాంగ్రెస్ VS బీజేపీ: పీవీ జయంతి చుట్టూ రాజకీయాలు
అలాగే 2021లో పండరిపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎన్సీపీ నేత భగీరత్ బాల్కే కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. దీనిపై శరద్ పవర్ మాట్లాడుతూ.. ఒక్క వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భగీరత్ భాల్కేకు టికెట్ ఇచ్చిన తర్వాత తమ నిర్ణయం తప్పని అనిపించిందని, కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడదల్చుకోలేదని అన్నారు.
కాగా మహారాష్ట్రలో పాగా వేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు ఆ రాష్ట్రంలో పర్యటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఆయన 600 వాహనాల భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లారు. పూర్తి స్థాయిలో కేసీఆర్ బలప్రదర్శన చేశారు. మంగళవారం షోలాపూర్‌లోని పండరీపూర్‌లోని విఠల్, రుక్మిణి దేవి ఆలయాలను దర్శించుకున్నారు. తర్వాత సర్కోలీలో జరిగిన బహిరంగ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం తుల్జాపూర్ భవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నారు
Comments
Please login to add a commentAdd a comment