ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర ముంబైలోని సిల్వర్ ఓక్‌లో పవార్ నివాసానికి ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. షూట్ చేసి చంపేస్తానని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడ్ని గుర్తించారు.
ఫోన్ చేసిన వ్యక్తి బిహార్‌కు చెందిన వాడని పోలీసులు వెల్లడించారు. ఇతను గతంలోనూ ఓసారి పవార్‌ను చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అయితే అప్పుడు అరెస్టు చేసి వదిలేశామని తెలిపారు.
ఇప్పుడు అదే వ్యక్తి మళ్లీ బెదిరింపు కాల్ చేయడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అతని కోసం వెతుకుతున్నామని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని వివరించారు.
చదవండి: ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు.. 24 గంటల్లోపే అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment