
కొల్హాపూర్: ఎన్సీపీలో చీలిక రాబోతోందంటూ వినవస్తున్న ఊహాగానాలకు పార్టీ అధినేత శరద్ పవార్ అడ్డుకట్టవేశారు. ‘పార్టీలో చీలిక అనే సమస్యే లేదు. ఒక వేళ నిజంగానే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడితే అది అంతవరకే పరిమితం. అంతేగానీ అది మొత్తం పార్టీకి వర్తించదు. ఎమ్మెల్యేలు అంటే అర్థం మొత్తం పార్టీ అని కాదు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నేనే. మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి జయంత్ పాటిల్ సారథ్యం కొనసాగుతుంది.
తిరుగుబాటు శాసనసభ్యులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?’ అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం పవార్ కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘ అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌లో భాగస్వామ్యం అయినా సరే ఎన్సీపీ చీలిపోలేదు. అజిత్ ఎన్సీపీ నేతగానే కొనసాగుతారు’ అని తెలిపారు. దీనిపై శరద్ స్పందిస్తూ.. ‘ అవును అది నిజమే. ఇందులో వివాదం ఏం లేదు’ అని అన్నారు. కానీ కొద్ది సేపటికే అలా అనలేదంటూ మాటమార్చారు.
Comments
Please login to add a commentAdd a comment