split in party
-
Lok sabha elections 2024: మళ్లీ ఇందిర
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు జనతా సర్కారు పుట్టి ముంచాయి. మళ్లీ ఇందిరకే ప్రజలు హారతి పట్టారు. కాంగ్రెస్‌లో రెండో చీలికనూ ఇందిర సమర్థంగా ఎదుర్కొని తిరుగులేని ప్రజా నేతగా నిలిచారు. 1984లో అమృత్సర్ స్వర్ణదేవాలయం సంక్షోభం, అనంతర పరిణామాలు ఇందిర దారుణ హత్యకు దారితీయడం, ఆమె వారసునిగా రాజీవ్‌గాంధీ పగ్గాలు చేపట్టడం వంటివి 1980–84 మధ్య చోటుచేసుకున్న పరిణామాలు... ‘జనతా’ బలహీనత ఇందిర విధానాలకు విసిగి కూటమి అయితే కట్టారు గానీ సిద్ధాంతాలపరంగా విపక్ష నేతలు భావ సారూప్యతకు రాలేకపోయారు. ప్రధాని కావాలన్న ఆకాంక్షలు ఇందుకు తోడయ్యాయి. జనతా కూటమి తరఫున ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్‌ని చరణ్ సింగ్ (లోక్‌దళ్), బాబూ జగ్జీవన్‌రాం (కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ) తదితర నేతలు తొలినుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. చివరికి ఇందిర మద్దతుతో చరణ్‌సింగ్ ప్రధాని అయినా తనపై ఎమర్జెన్సీ నాటి కేసులను ఎత్తేయాలన్న ఇందిర ఒత్తిళ్లకు తలొగ్గలేక 24 రోజుల్లోనే తప్పుకున్నారు. అలా మూడేళ్లకే 1980లో లోక్‌సభకు ముందస్తు ఎన్నికలొచ్చాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఐ) అఖండ మెజారిటీతో విజయం సాధించింది. ఏకంగా 353 సీట్లు సాధించింది. 1977 ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఇందిరకు ఇది గొప్ప ఘనతే. ఆనియన్ ఎలక్షన్ హామీలను నెరవేర్చడంలో, ధరల పెరుగుదలను అరికట్టడంలో జనతా సర్కారు తీవ్రంగా విఫలమైంది. ముఖ్యంగా ఉల్లి ధరలు కిలో ఏకంగా 6 రూపాయలు దాటేశాయి. దాంతో ఇందిర కూడా ఉల్లినే ప్రధాన ప్రచారాస్త్రం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా పత్రికా ప్రకటనల రూపంలోనూ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ధరలను నేలకు దించుతామంటూ అధికారంలోకి వచ్చారు. కానీ ఇందిర హయాంలో 1981లో ఉల్లి ధరలు మరోసారి మోతెక్కడం విశేషం! కాంగ్రెస్‌లో మరో చీలిక 1969లో తొలిసారి రెండుగా చీలిన కాంగ్రెస్ సరిగ్గా పదేళ్లకు 1979లో మళ్లీ రెండు ముక్కలైంది. 1979 జూలైలో నాటి కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ కాంగ్రెస్‌ను వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యూ) ఏర్పాటు చేసుకున్నారు. ఇందిర కుమారుడు సంజయ్‌గాంధీ మళ్లీ పార్టీలో కీలకంగా వ్యవహరించడం నచ్చకే దేవరాజ్ వేరుబాట పట్టారు. ఆ పార్టీకి 1980 ఎన్నికల్లో కేవలం 13 స్థానాలు దక్కాయి. ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్ (ఆర్–రెక్విజిషన్) కాస్తా కాంగ్రెస్ (ఐ)గా మారింది. ఐ అంటే ఇందిర! విశేషాలు... ఇందిర దారుణహత్య ► 1980 ఎన్నికలైన మూడు నెలలకే చరిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న బీజేపీ ఏర్పాటైంది. ► రాజకీయాల్లో ఇందిరకు చేదోడువాదోడుగా ఉంటున్న చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. ► 1981 ఫిబ్రవరి 16న రాజీవ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. సంజయ్ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఉప ఎన్నికలో లోక్‌దళ్ అభ్యర్థి శరద్ యాదవ్‌పై 2,37,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ► బింద్రన్‌వాలే సారథ్యంలోని సిక్కు వేర్పాటువాదాన్ని అణచేందుకు అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై చేపట్టిన సాయుధ చర్య చివరికి ఇందిరను బలి తీసుకుంది. 1984లో ఆమె తన సిక్కు అంగరక్షకుల చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ► ఇందిర వారసునిగా ప్రధాని పదవి చేపట్టిన రాజీవ్ ఆ వెంటనే ప్రజాతీర్పు కోరి కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత ఘనవిజయం సాధించారు. ఏడో లోక్‌సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పార్టీ స్థానాలు కాంగ్రెస్ 353 జనతా (ఎస్) 43 సీపీఎం 39 జనతా పార్టీ 31 డీఎంకే 16 కాంగ్రెస్(యూ) 13 సీపీఐ 10 ఇతరులు 28 స్వతంత్రులు 9 – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీ చీలదు
కొల్హాపూర్: ఎన్సీపీలో చీలిక రాబోతోందంటూ వినవస్తున్న ఊహాగానాలకు పార్టీ అధినేత శరద్ పవార్ అడ్డుకట్టవేశారు. ‘పార్టీలో చీలిక అనే సమస్యే లేదు. ఒక వేళ నిజంగానే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడితే అది అంతవరకే పరిమితం. అంతేగానీ అది మొత్తం పార్టీకి వర్తించదు. ఎమ్మెల్యేలు అంటే అర్థం మొత్తం పార్టీ అని కాదు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నేనే. మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి జయంత్ పాటిల్ సారథ్యం కొనసాగుతుంది. తిరుగుబాటు శాసనసభ్యులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?’ అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం పవార్ కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘ అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌లో భాగస్వామ్యం అయినా సరే ఎన్సీపీ చీలిపోలేదు. అజిత్ ఎన్సీపీ నేతగానే కొనసాగుతారు’ అని తెలిపారు. దీనిపై శరద్ స్పందిస్తూ.. ‘ అవును అది నిజమే. ఇందులో వివాదం ఏం లేదు’ అని అన్నారు. కానీ కొద్ది సేపటికే అలా అనలేదంటూ మాటమార్చారు. -
70 సార్లు చీలిన పార్టీ!
దేశంలో వందల సంఖ్యలో రాజకీయ పార్టీలున్నాయి. వాటిలో కొన్ని సొంతంగా ఏర్పడినవయితే మరికొన్ని పార్టీల చీలిక వల్ల పుట్టినవి. స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి మన దేశంలో కొనసాగుతున్న పార్టీ కాంగ్రెస్. వందేళ్ల చరిత్ర గల ఈ పార్టీ నుంచి అనేక ఇతర పార్టీలు పుట్టుకొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ 70 సార్లు చీలిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొందరు పార్టీ నుంచి బయటకొచ్చేసి కొత్త పార్టీలు పెట్టారన్నమాట. ఒక పార్టీ నుంచి ఇన్ని పార్టీలు పుట్టుకొచ్చినా వాటిలో చాలా వరకు కాలగమనంలో కనుమరుగవడమో, ఇతర పార్టీల్లో విలీనమవడమో జరిగింది. ఐదారు పార్టీలు మాత్రం మాతృ పార్టీ కంటే ఎక్కువ శక్తిమంతమయ్యాయి. కాంగ్రెస్‌లో మొట్టమొదటి చీలిక 1951లో వచ్చింది. జేబీ కృపలానీ కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1956లో సి.రాజగోపాలాచారి ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. 1959లో రాజగోపాలాచారి, ఎన్జీ రంగా కలిసి స్వతంత్ర పార్టీ, 1964లో కె.ఎం జార్జి కేరళ కాంగ్రెస్, 1967లో చరణ్‌సింగ్ నాయకత్వంలో భారతీయ క్రాంతి దళ్, 1967లో అజయ్ ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ ఏర్పడ్డాయి. 1969లో కె.కామరాజ్, మొరార్జీ దేశాయ్‌లు పార్టీ నుంచి బయటకొచ్చేసి కాంగ్రెస్(ఓ)పేరుతో పార్టీ పెట్టారు. మరో నేత ఇందిరా గాంధీ కూడా అదే సమయంలో కాంగ్రెస్(ఐ) పేరుతో మరో పార్టీ పెట్టారు. 1969లో బిజూ పట్నాయక్ ఉత్కళ్ కాంగ్రెస్, 1997లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, 2011లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలా 70కి పైగా పార్టీలు పుట్టుకొచ్చాయి. ఈ పార్టీలు కొన్ని ఆయా రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గుకు రాలేకపోవడంతో కొన్ని అస్తిత్వం కోల్పోయాయి. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు బలపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాతృ పార్టీ కంటే ఎక్కువ ప్రతిభ కనబరుస్తున్నాయి. 2014 ఎన్నికలను చూస్తే కాంగ్రెస్ 464 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు గెలుచుకుంది. తృణమూల్ 45 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాలను దక్కించుకుంది. ఎన్సీపీ 36 సీట్లకుగాను 6, వైఎస్సార్సీపీ 38 కిగాను 9 సీట్లలో విజయం సాధించాయి. -
చీలిక దిశగా అన్నాడీఎంకే!
తమిళనాడులోనే అతిపెద్ద పార్టీలలో ఒకటైన అన్నాడీఎంకే.. మరోసారి చీలిక దిశగా వెళ్తోంది. 1972లో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీని ఆయన తర్వాత దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు జయలలిత ఏకఛత్రాధిపత్యంగా నడిపించారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ మరోసారి చీలిపోయేందుకు సిద్ధంగా కనిపిస్తోంది. తనకు సుప్రీంకోర్టు జైలుశిక్ష విధించిన తర్వాత.. పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎడప్పాడి పళనిసామిని శశికళ ప్రతిపాదించారు. ఇది నిజానికి పార్టీలో చాలామందికి మింగుడుపడట్లేదని తెలుస్తోంది. ఇప్పటికే పళనిసామిపై అవినీతి ఆరోపణలున్నాయని, అందువల్ల అలాంటి వ్యక్తి కంటే.. అమ్మకు విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వం అయితేనే మేలని కొంతమంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దాంతో శశికళ బెంగళూరు బయల్దేరి వెళ్లిన తర్వాత ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతు విషయంలో పునరాలోచన చేసుకుంటారని.. అప్పుడే ఎవరి వెంట ఎంతమంది ఉన్నారన్నది కచ్చితంగా తెలుస్తుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే మరోవైపు ఇప్పటికే తమిళనాడులో బేరసారాలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. మద్దతివ్వాలంటే ఎంత ఇస్తారంటూ కొందరు ఎమ్మెల్యేలు బేరాలకు దిగుతున్నట్లు సమాచారం. ఇక పార్టీపై పట్టు విషయంలో కూడా రెండు వర్గాలుగా నేతలు చీలిపోయారు. ఎలాగైనా తన కుటుంబ సభ్యులందరినీ పార్టీలోకి తీసుకొచ్చి వాళ్లను అగ్రస్థానాల్లో కూర్చోబెట్టాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తీవ్ర ఆర్థిక ఆరోపణలున్న తన మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇదే దినకరన్‌ను ఇంతకుముందు జయలలిత పోయెస్ గార్డెన్తో పాటు పార్టీ నుంచి కూడా తరిమేశారు. అయితే ఇప్పుడు తన వాళ్లందరినీ తీసుకురావడం ద్వారా పార్టీపై తన పట్టు బిగించాలని శశికళ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న మధుసూదనన్, మైత్రేయన్, పాండియన్, పాండియరాజన్ తదితరులు మాత్రం ఈ పరిణామాలను జీర్ణించుకోలేక.. పన్నీర్ సెల్వం శిబిరం వైపు వచ్చేస్తున్నారు. దాంతో పార్టీలో స్పష్టమైన చీలిక ఇప్పటికే కనిపిస్తోంది. అసెంబ్లీలో బలపరీక్ష తర్వాత ఇది పూర్తిస్థాయిలో బయటపడుతుందని, అప్పటికి శశికళ వర్గం లో ఎంతమంది ఉన్నారు, పన్నీర్ వర్గంలో ఎంతమంది ఉన్నారన్న విషయం తేలిపోతుందని.. అప్పుడే ఇక పార్టీ గుర్తు, అధికారిక గుర్తింపు లాంటి అంశాలపై ఈసీ వరకు పోరాటం వెళ్తుందని భావిస్తున్నారు. అయితే.. ఇలాంటి పరిణామాల వల్ల రాబోయే ఎన్నికల్లో డీఎంకే ఎక్కువ లబ్ధిపొందే అవకాశం కూడా లేకపోలేదు. ఇన్నాళ్లూ ఒక్కటిగా ఉన్న పార్టీలో చీలిక వస్తే.. ఓట్లు కూడా చీలుతాయని, అది డీఎంకేకు తప్పనిసరిగా అనుకూలాంశం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడు మరిన్ని అప్డేట్స్ చూడండి.. శశికళకు మరో షాక్ శశికళ మేనల్లుడికి పెద్ద పోస్టు కనీసం ఇప్పుడైనా...! తొలి తేజం! శశికలే చిన్నమ్మకు చెరసాల నన్ను ఏ శక్తీ అడ్డుకోలేదు: శశికళ పళనిస్వామే ఎందుకు! ఇక శశికళ రూటు అదే: గౌతమి తమిళనాడు అసెంబ్లీలో ఎవరి బలమెంత..? -
చీలిక దిశగా సైకిల్ పార్టీ?
చక్రం తిప్పుతున్న చిన్నాన్న సీఎం పీకేసిన మంత్రిని కలిసిన శివపాల్ అనుచరులంతా పార్టీ ఆఫీసుకు వెళ్లాలని సూచన లక్నో: అంతా అయిపోయింది.. సమాజ్‌వాదీ పార్టీలో చీలికకు అంతా సిద్ధమైంది. రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్ క్రమంగా చక్రం తిప్పుతున్నారు. గురువారం రాత్రి తన మంత్రి పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన శివపాల్... శుక్రవారం ఉదయం తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. మనమంతా కలిసి పార్టీని బలోపేతం చేయాలని చెబుతూనే, ములాయం సింగ్ యాదవ్ పార్టీ కార్యాలయానికి వస్తారని, మీరంతా వెళ్లి ఆయనను కలవాలని చెప్పారు. దానికి తోడు.. ఇటీవలే సీఎం అఖిలేష్ యాదవ్ తన మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన ఇద్దరు మంత్రులలో ఒకరైన గాయత్రీ ప్రజాపతిని కూడా వెళ్లి కలిశారు. అవినీతిపరులన్న కారణంగా మంత్రివర్గం నుంచి ఇద్దరిని తప్పించడమే అఖిలేష్ - శివపాల్ మధ్య విభేదాలకు ఆజ్యం పోసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింఘాల్‌ను కూడా అఖిలేష్ ఇంటికి పంపేశారు. తన తండ్రి పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్తోను, సీఎం అఖిలేష్తోను ఫోన్లో మాట్లాడుతున్నారని శివపాల్ కుమారుడు ఆదిత్య యాదవ్ చెప్పారు. శివపాల్ గౌరవ మర్యాదలను కాపాడాలని, ఆయన నుంచి తప్పించిన మంత్రిత్వశాఖలన్నింటినీ తిరిగి ఇవ్వాలని, సమాజ్‌వాదీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఇవ్వాలని ఆయన మద్దతుదారులు శివపాల్ ఇంటి ముందు నినాదాలు చేశారు. వాళ్లు రాత్రంతా కూడా ఆయన ఇంటి ముందే ఉండిపోయారు. తాము నిద్రపోయేది లేదు.. వాళ్లను నిద్రపోనిచ్చేది లేదంటూ నినదించారు. మొదట్లో కీలక మంత్రిత్వశాఖలను నిర్వర్తించిన శివపాల్ యాదవ్‌కు.. ముఖ్యమైన శాఖలను ఆయన నుంచి తప్పించడంతో ఎక్కడలేని కోపం వచ్చింది. అది చాలదన్నట్లు తనవాళ్లు అనుకున్న ఇద్దరు మంత్రులను, సీఎస్‌ను కూడా పంపేయడంతో ఇక ఆయన తాడోపేడో తేల్చుకోవాలన్న దశకు వచ్చేశారు. అయితే, మంత్రిపదవికి ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తిరస్కరించారు. మరో వైపు పార్టీ అధ్యక్ష పదవికి చేసిన రాజీనామా విషయం ఏంటన్నది ఇంకా తెలియలేదు.