Jayant Patil
-
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
పార్టీ చీలదు
కొల్హాపూర్: ఎన్సీపీలో చీలిక రాబోతోందంటూ వినవస్తున్న ఊహాగానాలకు పార్టీ అధినేత శరద్ పవార్ అడ్డుకట్టవేశారు. ‘పార్టీలో చీలిక అనే సమస్యే లేదు. ఒక వేళ నిజంగానే పార్టీ ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడితే అది అంతవరకే పరిమితం. అంతేగానీ అది మొత్తం పార్టీకి వర్తించదు. ఎమ్మెల్యేలు అంటే అర్థం మొత్తం పార్టీ అని కాదు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిని నేనే. మహారాష్ట్ర రాష్ట్ర విభాగానికి జయంత్ పాటిల్ సారథ్యం కొనసాగుతుంది. తిరుగుబాటు శాసనసభ్యులకు ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?’ అని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. శుక్రవారం పవార్ కూతురు, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ‘ అజిత్ పవార్, కొందరు ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌లో భాగస్వామ్యం అయినా సరే ఎన్సీపీ చీలిపోలేదు. అజిత్ ఎన్సీపీ నేతగానే కొనసాగుతారు’ అని తెలిపారు. దీనిపై శరద్ స్పందిస్తూ.. ‘ అవును అది నిజమే. ఇందులో వివాదం ఏం లేదు’ అని అన్నారు. కానీ కొద్ది సేపటికే అలా అనలేదంటూ మాటమార్చారు. -
కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జయంత్ పాటిల్ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. #WATCH | Maharashtra NCP (Sharad Pawar faction) President Jayant Patil on reports that he met Union Home Minister Amit Shah yesterday; says, "Who told you this? (that I met Amit Shah) You should ask those who are saying all this. Last evening I was there at the residence of… pic.twitter.com/CkJHnEFZIR — ANI (@ANI) August 6, 2023 ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన -
కర్ణాటక ఫలితాలు నమ్మశక్యంగా లేవు
‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేనప్పటికీ ఇలాంటి ఫలితాలు రావడం నమ్మశక్యంగా లేదు. కర్ణాటకలో బీజేపీ సామర్థ్యం పరిమితమే. ఈ ఫలితాలను క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తగినంత సామర్థ్యం లేనిచోట బీజేపీ మరిన్ని ఓట్లు సాధిస్తే కచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజలకున్న అనుమానాలు నిజమని రుజువవుతాయి. ఏదేమైనా ఎన్నికల సంఘం(ఈసీ) బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికల్ని నిర్వహించాలి. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి. దీనిపై ఈసీ పునరాలోచించాలి’ -మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ -
సంజయ్‌దత్‌ని క్షమించొద్దు
పుణే: వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు క్షమాభిక్షపై రాజకీయ పార్టీలతోపాటు అనేక వర్గాలనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీతోపాటు బీజేపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎన్సీపీ అగ్రనాయకుడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ ‘పేలుళ్ల కేసులో సంజయ్ దోషిగా కోర్టు నిర్ధారించింది. న్యాయ ప్రక్రియ ముగిసిన అనంతరం జైలుశిక్ష విధించింది. ఆయనకు విధించిన తీర్పును క్షమిస్తే అప్పుడు న్యాయ ప్రక్రియకు అర్ధమే లేదు. తమను కూడా క్షమించాలంటూ ఇతర దోషులు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి డిమాండ్లు మున్ముందు బాగా పెరుగుతాయి’ అని అన్నారు. ‘సంజయ్‌కి శిక్ష తగ్గించాలా వద్దా అనే విషయంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సంజయ్‌కి కఠిన శిక్ష విధించాలని స్వయంగా హోం శాఖే డిమాండ్ చేసింది’ అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఎటువంటి చర్యనైనా వ్యతిరేకిస్తాం సంజయ్‌కి క్షమాపణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలనైనా తాము వ్యతిరేకిస్తామని బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈ విషయమై ఆ పార్టీ నాయకుడు వినోద్ తావ్డే మీడియాతో మాట్లాడుతూ ‘సంజయ్‌దత్ ని క్షమించాలనే విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడమనేది సరికాదు. సంజయ్ విషయంలో ఎటువంటి దయ చూపనవసరం లేదు. ఇప్పుడు దత్ ఎవరనే విషయంతో మాకు సంబంధం లేదు. 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో అతని ప్రమేయం ఆధారంగానే సుప్రీంకోర్టు శిక్ష విధించింది. అందువల్ల ఇప్పుడు అతనిని క్షమించడం దేశ ప్రజలకు తప్పుడు సందేశం పంపడమే అవుతుంది’ అని అన్నారు. దత్‌ను సుప్రీంకోర్టు దోషిగా ఖరారుచేసిందని, అందువల్ల అతనిపై ఎటువంటి సానుభూతి చూపనవసరం లేదన్నారు. క్షమాభిక్షను పరిశీలించొద్దని కోరతామన్నారు. సంజయ్‌కి క్షమాభిక్ష విషయంలో అభిప్రాయం తెలియజేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారన్నారు.