జయంత్ పాటిల్ (ఫైల్ ఫోటో)
‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేదు. సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేనప్పటికీ ఇలాంటి ఫలితాలు రావడం నమ్మశక్యంగా లేదు. కర్ణాటకలో బీజేపీ సామర్థ్యం పరిమితమే. ఈ ఫలితాలను క్షుణ్ణంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తగినంత సామర్థ్యం లేనిచోట బీజేపీ మరిన్ని ఓట్లు సాధిస్తే కచ్చితంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజలకున్న అనుమానాలు నిజమని రుజువవుతాయి. ఏదేమైనా ఎన్నికల సంఘం(ఈసీ) బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికల్ని నిర్వహించాలి. దీనివల్ల ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ ప్రజల అనుమానాలు నివృత్తి అవుతాయి. దీనిపై ఈసీ పునరాలోచించాలి’
-మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు జయంత్ పాటిల్
Comments
Please login to add a commentAdd a comment