మామ శరద్‌ పవర్‌ మాట.. బోరుమని ఏడ్చిన కోడలు | Sunetra Pawar Gets Emotional On Sharad Pawar's Remark | Sakshi
Sakshi News home page

మామ శరద్‌ పవర్‌ మాట.. బోరుమని ఏడ్చిన కోడలు

Published Sat, Apr 13 2024 7:46 PM | Last Updated on Sat, Apr 13 2024 7:57 PM

Sunetra Pawar Gets Emotional On Sharad Pawar's Remark - Sakshi

ముంబై: మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రచారం ఊపందుకుంది. ఈ ఎన్నికల్లో వదిన (సునేత్ర), మరదలు (సుప్రియా సూలే) మధ్య పోటీ నెలకొంది. 

కొద్ది రోజుల క్రితం ‘పవార్ కార్డ్’ ఉపయోగించి తన సతీమణి, లోక్‌సభ అభ్యర్ధి సునేత్రా పవార్‌ను గెలిపించాలని  ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విజ్ఞప్తి చేశారు. అయితే అజిత్‌ పవార్‌ వ్యాఖ్యల్ని శరద్‌ పవార్‌ ఖండించారు. సునేత్ర పవార్ బయటి వ్యక్తి అని శరద్ పవార్ అన్నారు. 

ఈ తరుణంలో మీడియా ప్రతినిధులు ఇదే అంశంపై సునేత్రా పవార్‌ను ప్రశ్నించారు. శరద్ పవార్ మిమ్మల్ని ‘బయటి పవార్’ అని అనడంపై సునేత్ర పవార్ కన్నీటి పర్యంతమయ్యారు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement