ఎన్సీపీ(ఎస్‌పి) అధినేత శరద్ పవార్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి ఏజెన్సీల సాయంతో ప్రతిపక్ష పార్టీల నాయకులలో భయాన్ని పుట్టించేందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి ఈడీ ‘సపోర్టింగ్ పార్టీ’ అని ఎద్దేవా చేశారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ పూణేలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శరద్ పవార్ మాట్లాడుతూ.. బీజేపీ..ఈడీ వంటి ఏజెన్సీల సహాయంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని, ప్రతిపక్షం నుండి పోటీ చేయవద్దని అభ్యర్థులను బెదిరిస్తుందని వాపోయారు.
ఈ సందర్భంగా 2005 - 2023 మధ్య ఈడీ తీసుకున్న చర్యలను ఉదహరిస్తూ.. 5,806 కేసులు నమోదు చేసిందని, వాటిల్లో కేవలం 25 మాత్రమే పరిష్కరించిందని తెలిపారు.
‘2005- 2023 మధ్య రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. యూపీఏ హయాంలో ఈడీ 26 మంది నాయకులను విచారించింది. వారిలో ఐదుగురు కాంగ్రెస్, ముగ్గురు బీజేపీకి చెందిన నేతలున్నారు. కానీ 2014 తర్వాత ఒక్క బీజేపీ నాయకుడిని కూడా ప్రశ్నించలేదన్న ఆయన... ఈడీ చర్యల గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసు. బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు కనిపిస్తోంది’ అని పవార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment