నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి.
‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది.
ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్‌లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్‌లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment