
న్యూఢిల్లీ : యూపీఏ(యునైడెట్ ప్రోగ్రెసివ్ అలియాన్సెస్) అధ్యక్షుడిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారంటూ గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై శరద్ పవార్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటానికి తనకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతుల ఉద్యమంపైనుంచి దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూపీఏ అధ్యక్షుడిగా తన పేరు తెరపైకి రావటంపై ఆయన గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. అయితే శివసేన మాత్రం శరద్ పవార్‌వైపే మొగ్గుచూపుతోంది. దీనిపై కూడా పవార్ స్పందించారు. ఒకవేళ శివనసేన తన పేరును సూచిస్తే అది ఆ పార్టీకి సంబంధించిన నిర్ణయం మాత్రమేనని, తనది కాదని స్పష్టం చేశారు. ( మరో బాంబు పేల్చిన నితీష్ కుమార్..)
దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ యూపీఏ అధ్యక్షుడిగా శరద్ పవార్ ఎన్నికవుతారని నేననుకోవటం లేదు. రెండు పార్టీలు కలిసి ఓ నిర్ణయం తీసుకుని అధ్యక్షుడ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ యూపీఏ అధ్యక్షుడి ఎన్నిక మాత్రమే జరుగుతుంది, ప్రధాని అభ్యర్థి ఎన్నిక కాదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment