'మోడీని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి' | Narendra Modi needs treatment for talking rubbish, says Sharad Pawar | Sakshi
Sakshi News home page

'మోడీని పిచ్చిఆసుపత్రిలో చేర్పించాలి'

Published Mon, Mar 31 2014 10:22 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

'మోడీని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి' - Sakshi

'మోడీని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి'

సాధారణ ఎన్నికలు మరో వారం రోజులలో ప్రారంభమవుతున్న తరుణంలో రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల దాడిని రోజురోజుకు పెంచుతున్నారు. అందులోభాగంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై వ్యక్తిగత దాడికి దిగారు. ఆదివారం  మహారాష్ట్రలోని గాస్వాంగిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శరద్ పవార్...  మోడీ పెద్ద వాగుడుకాయని ఆరోపించారు. మోడీ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. పిచ్చి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాలని  మోడీకి శరద్ పవార్ ఈ సందర్బంగా సూచించారు. మహారాష్ట్రలో అకోవా, నాందేడ్, అమరావతిలలో ఆదివారం మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శరద్ పవార్పై మోడీ విమర్శలు దాడి చేసిన సంగతి తెలిసిందే.

క్రికెట్పై అనర్గళంగా మాట్లాడే శరద్ పవార్...కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి కూడ దేశంలో రైతుల ఆత్మహత్యలు అపలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందించారు. ఓ రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే బాధ్యత వహించవలసి ఉంటుందంటూ ఓ టీవీ ఇంటర్వ్యూలో శరద్ పవార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 2002లో గుజరాత్లో జరిగిన అల్లర్లకు మోడీ బాధ్యత వహించవలసి ఉంటుందని శరద్ పరోక్షంగా ఆ ఇంటర్య్వలో వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఘర్షణలు చోటు చేసుకుంటే తానే బాధ్యత వహిస్తానని శరద్ పవార్ కుండబద్దలు కొట్టినట్లు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement