ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్సీపీపై అజిత్ పవార్ తిరుగుబావుట ఎగిరేసినప్పటినుంచి మరింత వేడెక్కాయి. ప్రస్తుతం ఎన్సీపీలో పవార్ వర్సెస్ పవార్ నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తమ బలాన్ని చాటుకునేందుకు ఇటు శరద్ పవార్, అటు అజిత్ పవార్ వర్గాలు నేడు వేరువేరుగా ముంబైలో ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించనున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇరువర్గాలకు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతుందనే దానిపై స్పష్టత లేని నేపథ్యంలో నేటీ భేటీతో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఎన్సీపీకి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు రెబల్ నేత అజిత్ పవార్‌తో కలిసి వేదికపై కనిపించారు. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని భేటీకి 13 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు సమాచారం.
83 ఏళ్ల యోధుడికి మద్దతివ్వాలి
ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద బుధవారం ఒంటి గంటకు నిర్వహించే కీలక సమావేశానికి హాజరు కావాలంటూ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తమ పార్టీ ఎమ్మెల్యేందరికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఆదివారం ఎన్సీపీ చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టిన జితేంద్ర అహ్వాద్ పేరుతో జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటి ముందు ‘ఒంటరిగా పోరాడుతున్న 83 ఏళ్ల యోధుడికి మద్దతు తెలిపాలి’ అంటూ భారీగా బ్యానర్లు వెలిశాయి.
బాంద్రాలో అజిత్ వర్గం ప్రత్యేక భేటీ
మరోవైపు తిరుగుబాటు నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బాంద్రాలో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. తనకే మెజారీటి ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని నిరూపించునే ప్రయత్రంలో ప్రత్యేక భేటీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా అతని అనుమతితో మాత్రమే తన ఫోటో ఉపయోగించాలని పరోక్షంగా అజిత్ పవార్‌ను ఉద్ధేశిస్తూ శరద్ పవార్ మంగళవారం వ్యాఖ్యానించారు. మంగళవారం అజిత్ నేతృత్వంలోని కొత్త కార్యాలయంలో శరద్ పవార్ ఫోటో కనిపించిన తర్వాత ఎన్సీపీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే నేటీ అజిత్ సమావేశంలోనూ శరద్ ఫోటోలు కనిపించడం గమనార్హం.
చదవండి: కేబినెట్ భేటీకి దూరం.. కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?
8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ
ఎన్సీపీని చీల్చుతూ అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా 8 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కాయి. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసిన 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ పార్టీ అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముందు పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇక మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి మొత్తం 53 ఎమ్మెల్యేల బలం ఉండగా.. అయితే తనకు 43 మంది శాసన సభ్యుల మద్దతు ఉందని అజిత్ పవార్ చెబుతున్నారు. అయితే అజిత్ వెనక ఉన్నది 13 మంది ఎమ్మెల్యేనంటున్న శరద్ వర్గం ఆరోపిస్తుంది. దీనిపై జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. అజిత్ వైపు నిలబడి పేపర్‌పై సంతకం చేసిన కొంతమంది ఎమ్మెల్యేలకు అసలు తాము ఎందుకు, దేనిపై సంతకం చేస్తున్నారో తెలియదని, కుట్రపూరితంగా ఇది జరిగిందంటూ ఆరోపించారు.
అజిత్, తన వర్గం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రమాణస్వీకారోత్సవానికి హాజరైన లోక్‌సభ ఎంపీ అమోల్ కోల్హే.. శరద్ పవార్‌కే తన విధేయత ఉంటుందని ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కలత చెందాను. రాజకీయాల నుంచి నిష్క్రమించాలనుకున్నాను. అయితే పార్టీ అధ్యక్షుడిని కలిసిన తర్వాత మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.
చదవండి: అజిత్ పవార్‌కు చేదు అనుభవం
ఎన్సీపీలో పార్టీ పేరు, గుర్తు కోసం గొడవ
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు కోసం ఇరు నేతల పంచాయితీ త్వరలో ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకోనుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం బుధవారం నాటి కీలక సమావేశం తర్వాత ఎన్నికల కమిషన్ ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీ పేరు, గుర్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నికల కమిషన్ తన మాట కూడా వినాలని కోరుతూ ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఇప్పటికే కేవియట్ దాఖలుచేసింది.ది.
Comments
Please login to add a commentAdd a comment