సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగకముందే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపి క ప్రక్రియ ప్రారంభించింది. భివండీ, పుణే, నాగపూర్, లాతూర్, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గాలలోని ఐదుగురు సిట్టింగ్ ఎంపీలను పక్కనబెట్టి కొత్తవారికి అవకాశమివ్వాలనే దానిపై ‘మహా’ నేతలు చర్చిస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం లోని 48 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 26, మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 22 స్థానా ల్లో పోటీచేయనున్నాయి.
జిల్లాల వారీగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితి, సిట్టింగ్ ఎంపీలు, కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల జాబితా రూపొందించి పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే కోరడంతో ఆ దిశగా నాయకులు కసరత్తును మొదలెట్టారు. కాంగ్రెస్ తమ వాటాలోకి వచ్చిన స్థానాల్లో అభ్యర్థులను ఖరారుచేసే ప్రక్రియను ప్రారంభించింది. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావు ఠాక్రే, ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి మోహన్ ప్రకా శ్ తదితరులు గత రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. శనివారం కూడా అభ్యర్థుల ఎంపి క విషయమై మంతనాలు జరిగాయి. పుణే, భివం డీ, నాగపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాల్లో సిట్టిం గ్ ఎంపీలపై తీవ్ర అసంతృప్తి వాతావరణం ఉన్నట్లు సమావేశంలో చర్చకు వచ్చింది. వీరిని మార్చాలనే దానిపై సమావేశంలో మంతనాలు జరిగాయి. అభ్యర్థులను మారిస్తే ఆ స్థానాలను సులభంగా గెలుచుకోవచ్చని అధిష్టానానికి సిపార్సు చేయాలని నిర్ణయించారు.
కాగా, పుణేలో సురేశ్ కల్మాడీపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. మళ్లీ అతనికి అభ్యర్థిత్వం ఇస్తే విమర్శలకు తావిచ్చినట్లవుతుంది. కానీ అభ్యర్థిత్వం ఎవరికివ్వాలనే దానిపై పార్టీ సందిగ్ధంలో పడిపోయింది. భివండీ ఎంపీ సురేష్ టావరేపై స్థానిక నేతల ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఇతనికి మొం డిచేయి చూపే అవకాశాలున్నాయి. ఇదే పరిస్థితి లాతూర్‌లోనూ ఉంది. సిట్టింగ్ ఎంపీ జయంత్ ఆవలేకు అభ్యర్థిత్వం ఇవ్వకూడదని స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్‌లో సిట్టింగ్ ఎంపీ భాస్కర్‌రావ్ ఖత్గావ్కర్‌పై స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ కూడా కొత్త ముఖానికి అవకాశమివ్వాలని పార్టీ అధిష్టానానికి సిఫార్సు చేయనున్నారు.
నాగపూర్ సిట్టింగ్ ఎంపీ విలాస్ ముత్తెం వార్‌కు టికెట్ నిరాకరించే సూచనలు కనిపిస్తున్నా యి. ఇక్కడ కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని ఇదివరకే డిమాండ్ ఉంది. అయితే ముంబైలోని ఐదుగురు కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇతర స్థానాల అభ్యర్థుల విషయంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇందులో ఎవరికి మరోసారి అవకాశం లభించనుంది..? ఎవరిని పక్కన బెట్టనున్నారనేది పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంది.
ఎంపికయ్యేదెవ్వరో!
Published Mon, Feb 17 2014 12:16 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement