న్యూఢిల్లీ: ఎన్సీపీలో తిరుగుబాటు చేసి అజిత్ పవార్ పార్టీ అధినేత శరద్ పవార్ ను వెన్నుపోటు పొడిచారని చెబుతూ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఎదుట కట్టప్ప బాహుబలిని చంపిన పోస్టర్లతో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి.
ఎన్సీపీ విద్యార్థి విభాగమైన రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ నాయకులు గద్దర్(నమ్మకద్రోహి) అని పెద్దగా రాసి బాహుబలి సినిమాలో కట్టప్ప అమరేంద్ర బాహుబలిని పొడిచిన దృశ్యం ఉన్న పెద్ద పోస్టర్ ని నిలబెట్టారు. ఢిల్లీ కార్యాలయం ఎదుట అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ లు ఉన్న పోస్టర్లన్నిటినీ తొలగించి వాటి స్థానంలో ఈ పోస్టర్లను, హోర్డింగులను ఏర్పాటు చేశారు.
పోస్టర్ మీద "మనలోని దేశద్రోహులు ఎవరన్నది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వారిని క్షమించరు" అని పైన చిన్నగా రాసి పెద్దగా నమ్మకద్రోహి అని రాశారు.
ఈ పోస్టర్లు, వాటిని ప్రతిష్టించిన వీడియోలు బయటకు రావడంతో ఎన్సీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించిన క్షణం నుండి మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ఈ రెండు వర్గాలు ఎలక్షన్ కమిషన్ ముందు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో ఉన్నాయి.
#WATCH | Old posters and hoardings of NCP that showed Ajit Pawar and Praful Patel on them are being removed from outside the office of the party in Delhi. A new poster with 'Gaddaar' (traitor) written on it is being put up there. pic.twitter.com/CjLoQmI5u9
— ANI (@ANI) July 6, 2023
ఇది కూడా చదవండి: యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment