
ఎన్‌సీపీ ఎమ్మెల్యే ధోబ్లేపై రేప్ కేసు
ముంబై: మహారాష్ట్రలో అక్టోబర్ 15న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి లక్ష్మణ్‌రావ్ ధోబ్లేపై అత్యాచార కేసు నమోదైంది. ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నలంద కాలేజీలో క్లర్క్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు శనివారం ధోబ్లేపై పోలీసులు కేసు నమోదు చేశారు.
శనివారం బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఫిర్యాదు ప్రకారం.. దోబ్లే బాధితురాలు పని చేస్తున్న కాలేజీకి ట్రస్టీ. 2011-13 మధ్య ధోబ్లే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయం ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తన ఫొటోలను బయటపెడతానని బెదిరించాడని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణలను ధోబ్లే ఖండించారు.