PM Conferred With Lokmanya Tilak National Award - Sakshi
Sakshi News home page

లోకమాన్య తిలక్‌ అవార్డు జాతికి అంకితం.. ప్రైజ్‌ మనీని అందుకోసం ఇచ్చేసిన ప్రధాని మోదీ

Published Tue, Aug 1 2023 3:04 PM | Last Updated on Tue, Aug 1 2023 3:41 PM

PM conferred with Lokmanya Tilak National award - Sakshi

పూణే: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో గౌరవం దక్కింది. స్వాతంత్ర సమరయోధుడు బాలాగంగాధర్‌ తిలక్‌ పేరిట నెలకొల్పిన లోకమాన్య తిలక్‌ నేషనల్‌ అవార్డును మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పుణేలో అందుకున్నారాయన.  ఈ సందర్భంగా ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. 

స్వాతంత్ర సమరంలో తిలక్‌ పాత్ర మరువలేనిది. ఎనలేని సేవలు అందించారాయన. అలాంటి వ్యక్తి గురించి కొంతే మాట్లాడి తక్కువ చేయలేం. తిలక్‌కు.. అలాగే అన్నా బాహూ సాథేలకు నా గౌరవ వందనాలు అంటూ పేర్కొన్నాయాన. 

బాలాగంగాధర్‌ తిలక్‌ 103వ వర్ధంతి సందర్భంగా.. లోకమాన్య తిలక్‌ నేషనల్‌ అవార్డును ఇవాళ పుణేలో నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. నాయకత్వ పటిమ, పౌరుల్లో దేశభక్తి పెంపొందించినందుకుగానూ ఈ ఏడాది ఆ పురస్కారాన్ని మోదీకి ‘ది తిలక్‌ స్మారక్‌ మందిర్‌ ట్రస్ట్‌’’ అందించింది. మెమెంటోతో పాటు లక్ష రూపాయల ప్రైజ్‌ మనీ అందించారు. ఆ ప్రైజ్‌మనీని నమామీ గంగ ప్రాజెక్టుకు ఇచ్చేశారాయన.

ప్రతీ ఏడాది ఆగష్టు 1వ తేదీన ఆయన వర్థంతి సందర్భంగా ఈ అవార్డును బహుకరిస్తారు. 1983 నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు. దేశ పురోగతి, అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేయబడుతుంది. ఇప్పటివరకు 40 మంది ఈ పురస్కారం అందుకోగా.. ప్రధాని మోదీ 41వ వ్యక్తి. 

పవార్‌తో ఆప్యాయ పలకరింపు
ఇదిలా ఉంటే.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరుకాగా.. ప్రధానిమోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇండియా కూటమి తరపున విపక్షాలు.. ముఖ్యంగా థాక్రే శివసేన వర్గం ఆయన్ని కార్యక్రమానికి హాజరు కాకూడదని కోరిన సంగతి తెలిసిందే.

పలు ప్రాజెక్టులు సైతం.. 

మెట్రో రైళ్ల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ మహారాష్ట్ర పర్యటనలో శంకుస్థాపన చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement