
ఆస్పత్రి నుంచి సైనా డిశ్చార్జి
ముంబై: ఇటీవల తన కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రియో ఒలింపిక్స్ లో లీగ్ దశ నుంచి నిష్క్రమించిన సైనా మోకాలి గాయం తీవ్రంగా బాధించడంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది.
చికిత్స నిమిత్తం తొలుత హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన సైనా, ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం ముంబైకు వెళ్లింది. కోకిలా బెన్ ఆస్పత్రిలో శనివారం సైనాకు శస్త్రచికిత్స పూర్తికావడంతో ఆమె కోలుకుంటుంది. కాగా, కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పూర్తయిన తరువాత అంథేరీ ఆస్పత్రిలో కూడా సైనా చెకప్ చేయించుకుంది.