హైదరాబాద్: కారు ప్రమాదంలో గాయపడ్డ తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రి నుంచి మంత్రి తన నివాసానికి వెళ్లారు. ఈటల కోలుకున్నారని వైద్యులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో శనివారం ఈటల రాజేందర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నుంచి కరీంనగర్‌కు ఆయన బుల్లెట్‌ప్రూఫ్ కారులో వెళ్తుండగా మార్గమధ్యంలో టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఈటల కాలుకు గాయాలయ్యాయి. పీఏలు, డ్రైవర్, గన్‌మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరికరి కరీంనగర్‌లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ఈటల రాజేందర్ డిశ్చార్జి
Published Mon, Jun 15 2015 8:26 PM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM
Advertisement
Advertisement