
23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తాం: కలెక్టర్
విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన మెడికోలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ. బాబు పరామర్శించారు. నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎ.బాబు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను కూడా ఆయన ఆరా తీశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఎ. బాబు మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో గాయపడిన 23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 8 మందిని మాత్రం డిశ్చార్జ్ చేయడం లేదన్నారు. డిశ్చార్జ్ అయినవారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని కలెక్టర్ ఎ.బాబు చెప్పారు.