krishna district collector
-
ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తాం: కలెక్టర్
-
ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
-
23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తాం: కలెక్టర్
విజయవాడ : డ్రైవర్ నిర్లక్ష్యంతో తీవ్రంగా గాయపడిన తెలంగాణకు చెందిన మెడికోలను కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ. బాబు పరామర్శించారు. నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎ.బాబు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను కూడా ఆయన ఆరా తీశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎ. బాబు మాట్లాడుతూ... ఈ ప్రమాదంలో గాయపడిన 23 మంది విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. 8 మందిని మాత్రం డిశ్చార్జ్ చేయడం లేదన్నారు. డిశ్చార్జ్ అయినవారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని కలెక్టర్ ఎ.బాబు చెప్పారు. -
భూసేకరణకు రిజిస్ట్రేషన్ ధరే ఇస్తామంటున్న కలెక్టర్
-
భూసేకరణకు రిజిస్ట్రేషన్ ధరే ఇస్తామంటున్న కలెక్టర్
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలోని విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లనే ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో కలెక్టర్ అహ్మద్ బాబు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై చర్చ జరిగింది. విమానాశ్రయం కోసం సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో ఆ ధరనే ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అందుకు రైతులు వ్యతిరేకించారు. మార్కెట్ ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దాంతో వారిమధ్య అంగీకారం కుదరలేదు. న్యాయపోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు. -
ఇంటికిపో, బయటకు పో అంటూ...
విజయవాడ : జిల్లా కలెక్టర్ బాబు.ఎ వ్యవహార శైలిపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. శనివారం రాత్రి గాంధీనగర్ ఎన్జీవో అసోసియేషన్ హాలులో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ వేధింపులపై పలువురు నాయకులు, అధికారులు మండిపడ్డారు. కలెక్టర్ తమను కట్టు బానిసలుగా చూస్తున్నారని పలువురు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రతి అధికారిని యూజ్లెస్, వేస్ట్‌ఫెలో, ఇంటికిపో, బయటకు పో అంటూ పదేపదే దుర్భాషలాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ తన తీరు మార్చుకోకపోతే సహకరించేది లేదని సమావేశంలో తీర్మానించారు. జిల్లా అధికారులు, గెజిటెడ్ అధికారులను సైతం అటెండర్ల కంటే హీనంగా కలెక్టర్ తిడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దస్తమానం ల్యాప్‌ట్యాబ్, ల్యాప్‌టాబ్ అంటూ తమను ముప్పుతిప్పలు పెడుతున్నారని వారు పేర్కొన్నారు. దీనివల్ల సాధారణ విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడి ప్రజలు తమపై తిరగబడుతున్నారని చెప్పారు. ఈ-పోస్ విధానం అట్టర్ ఫాప్ల్ అయిందని అన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత వీడియో కాన్ఫరెన్స్‌లు, సెల్ కాన్ఫరెన్స్‌లకు హాజరు కాకూడదని తీర్మానించారు. ఈ సమావేశానికి ఎన్జీవో అసోసియేషన్ నాయకులు హాజరై తమ మద్దతు ప్రకటించారు.