
గన్నవరం విమానాశ్రయం
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరంలోని విమానాశ్రయం విస్తరణకు సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ రేట్లనే ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్లో కలెక్టర్ అహ్మద్ బాబు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై చర్చ జరిగింది.
విమానాశ్రయం కోసం సేకరించే భూమికి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించిందో ఆ ధరనే ఇస్తామని కలెక్టర్ చెప్పారు. అందుకు రైతులు వ్యతిరేకించారు. మార్కెట్ ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దాంతో వారిమధ్య అంగీకారం కుదరలేదు. న్యాయపోరాటానికి సిద్ధమవుతామని రైతులు హెచ్చరించారు.