న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక, రక్షణశాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గత నెల 28న ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. జైట్లీ ఆరోగ్యం మెరుగుపడిందని ఆయనను ఈరోజు ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి అధికారి ప్రతినిధి అమిత్ గుప్తా తెలిపారు. రొటీన్ చెకప్ కోసమే వచ్చినట్లు చెప్పారు. గతంలో మధుమేహం సోకటంతో జైట్లీ శస్త్ర చికిత్సను చేయించుకున్నారు.
అనంతరం ఆయనకు ఇన్‌ఫెక్షన్‌లు సోకటంతో ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాగా జైట్లీ ఈ నెల 8వ తేదీన అమెరికా వెళ్లాల్సి ఉంది. అక్టోబరు 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వాషింగ్‌టన్‌లో జరగనున్న ప్రపంచబ్యాంకు సదస్సుల ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆయన హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు.
ఆస్పత్రి నుంచి అరుణ్ జైట్లీ డిశ్చార్జ్
Published Mon, Oct 6 2014 2:28 PM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement