ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి | Sonia Gandhi discharged from Ganga Ram Hospital in Delhi | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి

Published Sun, Aug 14 2016 10:28 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి - Sakshi

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి

న్యూఢిల్లీ: ఎడమ భుజానికి శస్త్రచికిత్స, జ్వరం కారణంగా గత 11 రోజులుగా ఆస్పత్రిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు.

11 రోజుల క్రితం వారణాసి పర్యటన సందర్భంగా అస్వస్థతకు గురైన సోనియాను తొలుత ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. పూర్తిగా కోలుకోవడంతో సోనియా గాంధీని డిశ్చార్జి చేసినట్టు గంగారాం ఆస్పత్రి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement