సూరి (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కోలుకుంటోంది. శుక్రవారం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణలోని గృహానికి ఆమెను తరలించినట్టు అధికారులు తెలిపారు. గురువారం ఆమెను బోల్పూర్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆమె వాంగాల్మాన్ని నమోదు చేశారు.
బీర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేయించిన సంగతి తెలిసిందే. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకుగాను.. ఖాప్ పంచాయతీ పెద్దలు 13 మంది వ్యక్తులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకుంది.
అత్యాచార బాధితురాలి డిశ్చార్జి
Published Fri, Jan 31 2014 4:20 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement