Gangrape victim
-
అవమానం భరించలేక..
సాక్షి, జయపురం: ఒడిశాలో సంచలనం రేపిన సామూహిక అత్యాచారం బాధితురాలు సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కొరాపుట్ జిల్లా కుందులి ప్రాంతంలో సామూహిక లైంగికదాడికి గురైన బాలిక అవమాన భారం భరించలేక ఉరి వేసుకుని తనువు చాలించింది. గత ఏడాది అక్టోబర్‌లో జవాను దుస్తులతో ఉన్న నలుగురు తనను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు 9వ తరగతి విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. బాధితురాలు ఆరోపిస్తున్న సంఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల కమిటీలు, పలు స్వచ్ఛంద సంస్థలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ నిర్వహించింది. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఇన్ని జరిగినా ఆమెకు న్యాయం జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసు నమోదైన నాటి నుంచి ఆమె బంధువులను, ఆమెను పోలీసులు అనుమానిస్తూనే వచ్చారు. అసలు ఆమెపై లైంగికదాడి జరిగినట్లు ఏ మెడికల్ రిపోర్టులోనూ లేదని కొరాపుట్ ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె అబద్ధం చెబుతోందని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. చివరకు విచారణకు కొరాపుట్ జిల్లా జడ్జిని నియమించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అవమానం భరించలేక కందులి కమ్యూనిటీహెల్త్ సెంటర్లో ఉరి వేసుకుంది. బాధితురాలి బంధువులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి కలసి ఓదార్చారు. -
గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం
రోహ్టక్: హరియాణాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసిన నిందితులు మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. రేప్ కేసును ఉపసంహరించుకోనందుకు నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు. భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసినా తర్వాత బెయిల్‌పై బయటకువచ్చారు. కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా నిందితులు బాధిత కుటుంబ సభ్యులను పలుమార్లు బెదిరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం రోహ్టక్కు మారింది. రోహ్టక్లోని ఓ మహిళా కాలేజీలో బాధితురాలు చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి సుఖ్పుర చౌక్ వద్ద బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఆమె దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు తనను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. -
చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వ సాయం
వీణవంక (కరీంనగర్) : వీణవంక మండలం చల్లూరు గ్యాంగ్ రేప్ బాధితురాలికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. తొలి విడతగా సోమవారం రూ.90 వేలు ఆమెకు అందజేశారు అధికారులు. కానిస్టేబుల్ పరీక్షల కోసం ఉచిత శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ఓ యువతిపై అక్కడే శిక్షణ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు గత నెలలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
అత్యాచార బాధితురాలి డిశ్చార్జి
సూరి (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు కోలుకుంటోంది. శుక్రవారం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణలోని గృహానికి ఆమెను తరలించినట్టు అధికారులు తెలిపారు. గురువారం ఆమెను బోల్పూర్ సబ్ డివిజనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఆమె వాంగాల్మాన్ని నమోదు చేశారు. బీర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేయించిన సంగతి తెలిసిందే. వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించినందుకుగాను.. ఖాప్ పంచాయతీ పెద్దలు 13 మంది వ్యక్తులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును సుమోటోగా తీసుకుంది. -
ఏం మాట్లాడాలో తెలియడం లేదు: గంగూలీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన బాలికపై సామూహిక అత్యాచార ఘటనను మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తీవ్రంగా ఖండించాడు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. 'ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఇటువంటి అకృత్యాలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. బాలికపై గ్యాంగ్‌రేప్ ఘటన గుండెలు పిండేసే బాధాకర ఘటన. దోషులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి' అని బెంగాలీ వార్తా చానల్‌తో గంగూలీ అన్నాడు. రేపిస్టులకు సహాయపడే వారిని వదలకూడదని విజ్ఞప్తి చేశాడు. కోల్‌కతాలో సామూహిక అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలిక కాలిన గాయాలతో మంగళవారం ఆస్పత్రిలో కన్నుమూసింది. అక్టోబర్ నెలలో ఆమె రెండుసార్లు లైంగిక దాడికి గురవడంతో ఆత్మహత్యకు యత్నించిందని మొదట అనుకున్నారు. అయితే రేపిస్టులే తనపై కిరోసిన్ పోసి తగలబెట్టారని చనిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలంలో బాధితురాలు పేర్కొందని పోలీసులు తెలిపారు. కాగా, తమకు బెదిరింపులు వస్తున్నాయని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.