బాలిక మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి
సాక్షి, జయపురం: ఒడిశాలో సంచలనం రేపిన సామూహిక అత్యాచారం బాధితురాలు సోమవారం ఆత్మహత్య చేసుకుంది. కొరాపుట్ జిల్లా కుందులి ప్రాంతంలో సామూహిక లైంగికదాడికి గురైన బాలిక అవమాన భారం భరించలేక ఉరి వేసుకుని తనువు చాలించింది. గత ఏడాది అక్టోబర్‌లో జవాను దుస్తులతో ఉన్న నలుగురు తనను ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు 9వ తరగతి విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే.
బాధితురాలు ఆరోపిస్తున్న సంఘటనపై వివిధ రాజకీయ పార్టీలు, మానవ హక్కుల కమిటీలు, పలు స్వచ్ఛంద సంస్థలు సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశాయి. తర్వాత రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ నిర్వహించింది. క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. ఇన్ని జరిగినా ఆమెకు న్యాయం జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. కేసు నమోదైన నాటి నుంచి ఆమె బంధువులను, ఆమెను పోలీసులు అనుమానిస్తూనే వచ్చారు.
అసలు ఆమెపై లైంగికదాడి జరిగినట్లు ఏ మెడికల్ రిపోర్టులోనూ లేదని కొరాపుట్ ఎస్పీ వెల్లడించిన విషయం తెలిసిందే. ఆమె అబద్ధం చెబుతోందని అప్పట్లో పోలీసులు ఆరోపించారు. చివరకు విచారణకు కొరాపుట్ జిల్లా జడ్జిని నియమించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు అవమానం భరించలేక కందులి కమ్యూనిటీహెల్త్ సెంటర్‌లో ఉరి వేసుకుంది. బాధితురాలి బంధువులను జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి కలసి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment