
ప్రముఖ ఒడిశా నటి, సింగర్ రుచిస్మిత గురు ఆత్మహత్య కేసు కలకం రేపుతోంది. పలు ఆల్భమ్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన రుచిస్మిత ఆత్మహత్య కేసులో ఆమె తల్లి ట్విస్ట్ ఇచ్చింది. 'సూసైడ్‌కు ముందు తన కూతురు పరోటా విషయంలో గొడవ పడిందని చెప్పింది. ఆదివారం రాత్రి 8గంటలకు పరోటా చేయమంది. కానీ నేను 10 గంటలకు చేస్తానని చెప్పడంతో గొడవ జరిగింది. దీంతో రుచిస్మిత తన రూంలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
గతంలో కూడా పలుమార్లు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది' అంటూ రుచిస్మిత తల్లి ఆరోపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది నిజంగా ఆత్మహత్యనా లేక మరేదైనా జరిగిందా అన్న కోణంలో విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment