గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం | Gangrape victim raped again by ‘same accused’ in Rohtak | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం

Published Fri, Jul 15 2016 6:05 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం - Sakshi

గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం

రోహ్టక్: హరియాణాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసిన నిందితులు మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. రేప్ కేసును ఉపసంహరించుకోనందుకు నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు.

భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసినా తర్వాత బెయిల్పై బయటకువచ్చారు. కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా నిందితులు బాధిత కుటుంబ సభ్యులను పలుమార్లు బెదిరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం రోహ్టక్కు మారింది. రోహ్టక్లోని ఓ మహిళా కాలేజీలో బాధితురాలు చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి సుఖ్పుర చౌక్ వద్ద బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఆమె దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు తనను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement