బలవంతంగా కారులో ఎక్కించుకుని.. | Dalit gangrape case: Victim says she was beaten, drugged | Sakshi
Sakshi News home page

బలవంతంగా కారులో ఎక్కించుకుని..

Published Tue, Jul 19 2016 2:23 PM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

బలవంతంగా కారులో ఎక్కించుకుని.. - Sakshi

బలవంతంగా కారులో ఎక్కించుకుని..

రోహ్టక్: 'హర్యానాలోని రోహ్టక్ కాలేజీలో నేను బీఎస్సీ మ్యాథ్స్ చదువుతున్నాను. బుధవారం ఉదయం 9 గంటలకు కాలేజీకి వెళ్లాను. మధ్యాహ్నం 1.30 గంటలకు కాలేజీ నుంచి తిరిగొస్తుండగా అంబేద్కర్ చౌక్ వద్ద అమిత్, జగ్మోహన్ కారు దగ్గర నిలబడి ఉండడం చూశాను. దారిలో వారు నన్ను అడ్డగించారు. నేను చాలా భయపడ్డాను. బలవంతంగా నన్ను కారులోకి తోసేశారు. మౌసమ్, ఆకాశ్, సందీప్ కారు లోపల కూర్చునివున్నారు. నేను కేకలు పెట్టకుండా చెంపదెబ్బలు కొట్టారు.

నా సోదరుడి కోసం కూడా వెతికినా అతడు దొరకలేదని చెప్పారు. నాతో బలవంతంగా మత్తు పదార్థం తినిపించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియలేదు. స్పృహ వచ్చేసరికి అర్ధనగ్నంగా పడివున్నాను. మరోసారి అత్యాచారానికి గురైయ్యానని అర్థమైంది. నన్ను కారులోంచి బయటకు గెంటేశారు. నన్ను చంపాలని ఒకడు అన్నాడు. చిక్కుల్లో పడతామని మిగిలివాళ్లు వారించారు. నన్ను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. అదే దారిలో వెళుతున్న కొంత మంది మహిళలు నన్ను ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక ఐదుగురు రేపిస్టులపై కేసు పెట్టాను. జైలుకు వెళ్లినా వీళ్ల బుద్ధి మారలేదు. తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాల'ని రోహ్టక్ గ్యాంగ్ రేప్ బాధితురాలు పేర్కొంది.

హర్యానాలోని భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. మళ్లీ బుధవారం మరోసారి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు, మహిళా సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement