తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం | Wrath of the fool-proof method of drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం

Published Thu, May 22 2014 4:05 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

నగరంలో నానాటికీ జఠిలమవుతున్న తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • సమస్య పరిష్కరించాలని డిమాండ్
  •  చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నగరంలో నానాటికీ జఠిలమవుతున్న తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన నగరసభ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చైర్‌పర్సన్ లీలావతి మాట్లాడుతూ.. చిక్కబళ్లాపురానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న జక్కలమడుగు జలాశయం నుంచి మే నెల చివరి వరకూ నీరు అందాల్సి  ఉందని తెలిపారు.
     
    అయితే జలాశయం ఏప్రిల్ మొదటి వారానికి ఖాళీ అయిందని, ఈ జలాశయం నుంచి 33 శాతం నీరు దొడ్డబళ్లాపురానికి వెళుతోందని తెలిపారు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లో ఫుట్‌బాల్‌ను రెండున్నర అడుగులు పెంచినందున నిర్ణీత శాతానికన్నా ఎక్కువగా నీరు ఆ ప్రాంతానికి వెళుతోందని, ఫలితంగా చిక్కబళ్లాపురానికి నీరు తక్కువగా అందుతోందని రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ విషయంపై నీటి సరఫరా అధికారిని సభ్యులు నిలదీశారు.

    నగరసభ కమిషనర్ మునిశామప్ప జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. జిల్లాకు నీరు తక్కువగా వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు సైతం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. కమిషనర్ సమాధానంతో సభ్యులు మహకాళీబాబు, కిసాన్ కృష్ణప్ప, శ్రీనివాస్ తదితరులు ఏకీభవించలేదు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లోని ఫుట్‌బాల్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    అధికారికంగా ఈ చర్యను చేపట్టకపోతే గురువారం ఉదయం సభ్యులే అక్కడికెళ్లి ఫుట్‌బాల్‌ను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు జబీన్‌తాజ్, సభ్యులు ఎ.బి.మంజునాథ్, రఫీక్, నిర్మల ప్రభు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement