విజేత ఎస్‌ఏ అంబర్‌పేట్ | SA winner ambarpet | Sakshi
Sakshi News home page

విజేత ఎస్‌ఏ అంబర్‌పేట్

Published Fri, Mar 14 2014 12:07 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

విజేత ఎస్‌ఏ అంబర్‌పేట్ - Sakshi

విజేత ఎస్‌ఏ అంబర్‌పేట్

దూలపల్లి, జేఎన్‌టీయూ హైదరాబాద్ జోన్ ‘సి’ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో కండ్లకోయకు చెందిన ఎంఆర్‌సీఈటీ జట్టు విజేతగా నిలిచింది. కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ టోర్నీ టైటిల్ పోరులో సీఎంఆర్‌సీఈటీ జట్టు... మైసమ్మగూడకు చెందిన ఎంఆర్‌సీఈటీ కళాశాలపై విజయం సాధించింది.

విజేతలకు పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ ట్రోఫీని అందజేశారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, డెరైక్టర్ చంద్రశేఖర్ యాదవ్, ప్రిన్సిపాల్ వెంకటరమణా రెడ్డి, ఫిజికల్ డెరైక్టర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.








జింఖానా, న్యూస్‌లైన్: ఎ-డివిజన్ వన్డే నాకౌట్ టోర్నీలో ఎస్‌ఏ అంబర్‌పేట్ జట్టు విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఏ అంబర్‌పేట్ జట్టు 78 పరుగుల తేడాతో కాంటినె ంటల్ జట్టుపై విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఏ అంబర్‌పేట్ 177 పరుగుల వద్ద ఆలౌటైంది. పరమ్‌వీర్ సింగ్ (51) అర్ధ సెంచరీతో రాణించగా... ప్రవీత్ 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాంటినెంటల్ బౌలర్లు శ్రవణ్ కుమార్, అర్జున్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన కాంటినెంటల్ 99 పరుగులకే కుప్పకూలింది. ఎస్‌ఏ అంబర్‌పేట్ బౌలర్లు పరమ్‌వీర్ సింగ్ 4, ఖలీద్ 3 వికెట్లు చేజిక్కించుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement