ప్రశాంతంగా ముగిసిన టీఎస్ ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్ ఎంసెట్–2019 గురువారం తో ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 3, 4, 6 తేదీ ల్లో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు.. 8, 9 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. చివరి నిమిషంలో విద్యా ర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చి ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాలను తెరిచి ఉంచారు. దీంతో చివరి నిమిషం దాటాక వచ్చి పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన ఘటనలు పెద్దగా చోటుచేసుకోలేదు. ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసారి అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకున్నారు. రాష్ట్రంలోని 15 టెస్ట్ జోన్లు, 83 పరీక్ష కేంద్రాలు, ఏపీలోని 3 టెస్ట్ జోన్లు, 11 కేంద్రాల్లో ఎంసెట్‌ను నిర్వహించారు. ఇంజ నీరింగ్ పరీక్షకు 1,42,216 మంది రిజిస్టర్ చేసుకోగా.. 1,31,209 మంది (92.26%) హాజరయ్యారు.
అగ్రికల్చర్ విభాగంలో 91.41 శాతం హాజరు
అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షను ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించారు. గురువారం ఉదయం 10 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష జరిగింది. తెలంగాణలోని 78 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 21,753 మంది రిజిస్టర్ చేసుకోగా.. 20,150 (92.7 శాతం) మంది హాజరయ్యారు. ఏపీలోని 7 కేంద్రాల్లోనూ ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు 3,339 మంది రిజిస్టర్ చేసుకోగా.. 2,740 (82.01 శాతం) మంది హాజరయ్యారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగం పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 74,989 మంది రిజిస్టర్ చేసుకోగా.. 68,550 మంది (91.41 శాతం) హాజరయ్యారు.