Drinking problem
-
గిరివాసుల దాహం తీర్చండి
సీతంపేట: గిరిజన ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆమె ఈ సమస్యను ప్రస్తావించారు. ఏటా గిరిజన మహిళలు చాలా ఇబ్బం దులు పడుతున్నారన్నారు. దూరంలో ఉన్న కొండవాగుల్లో నీటి కోసం నడిచి వెళ్తున్నారన్నారు. ఆ నీరు తాగి వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. ట్యాం కుల ద్వారా సరఫరా చేస్తారో, ఎన్టీఆర్ సుజల ధార ఎప్పుడు అందిస్తారో తెలియజేయాలని పట్టుబట్టారు. గత సమావేశాల్లో 570 ఏజెన్సీ గ్రామాలలో 24 గ్రామాలకు రక్షిత పథకాలు ఏర్పాటు చేశారన్నారు. మిగతా గ్రామాలకు రక్షిత నీరు అందించాలని గుర్తు లేదా అని ప్రశ్నించారు. మహిళల దినోత్సవం రోజైనా మహిళల నీటి కష్టాలు తీరుస్తామని ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ బెల్టు షాపులను నిషేధించండి... మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారితపై చర్చలో పాల్గొంటూ బెల్టుషాపులను ప్రభుత్వం నిషేధించాలన్నారు. వీటి వలన ఎన్నో కుటుంబాలు నాశనమౌతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాటు సారా పేరుతో గిరిజనులను వేధించడం తగదన్నారు. సారా తయారీకి ప్రోత్సాహించేవారిని నియంత్రించలేకపోతున్నారన్నారు. అధికారంలోకి వస్తే మద్యాన్ని నిషేధిస్తామని తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ప్రకటించడం గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం ఫీజు రియంబర్స్ మెంట్ వంటి పథకాలు పూర్తిగా అమలు చేయకపోవడంతో పిల్లలను చదివించుకోలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మా ఇంటి మహలక్ష్మి పథకం కూడా అమలు జరగడం లేదన్నారు. ఏజెన్సీ వైద్యాధికారి పోస్టులను బర్తీ చేయాలన్నారు. మహిళా ప్రజాప్రతినిధులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అన్నారు. గిరిపుత్రిక కళ్యాణ పథకానికి నిధులు సరిగా కేటాయించడం లేదన్నారు. మైనర్బాలికా వివాహాలను అడ్డుకోలేకపోవడం వలన వారికి రావాల్సిన రాయితీలు కోల్పోతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరైనా గిరిజనులు చనిపోతే ఇంటికి ప్రైవేట్ వహానాల్లో తీసుకువస్తే రవాణా చార్జీలు ప్రభుత్వం చెల్లించాలన్నారు. -
మంచినీటి సమస్యపై దృష్టి
ఏజెన్సీలో 131 పాఠశాలల్లో సదుపాయానికి ప్రతిపాదనలు పాఠ్యపుస్తకాల బాధ్యత హెచ్‌ఎంలదే అందలేదని ఫిర్యాదు వస్తే చర్య డీఈఓ వెంకటకృష్ణారెడ్డి చోడవరం/మాడుగుల : పాఠశాలల్లో మంచినీటి సమస్యపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే పాఠ్యపుస్తకాలు అందలేదని ఎక్కడి నుంచైనా ఫిర్యాదు వస్తే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. శనివారం చోడవరం, మాడుగుల మండలాలలో ఆయన పర్యటించారు. చోడవరం జెడ్పీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మంచినీరు, సైన్స్‌ల్యాబ్, పాఠశాల ఆవరణ పరిశీలించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో 131 పాఠశాలల్లో మంచి నీటి సమస్య ఉందని గుర్తించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ప్ర తిపాదనలు పంపామన్నారు. ఈసారి జూన్ 7 నాటికే జిల్లాలో 24 లక్షల 67 వేల 263 పాఠ్యపుస్తకాల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 28 వేల పుస్తకాల కొరత ఉందన్నారు. పంపిణీ చేసిన పుస్తకాలు అందించే బాధ్యత హెచఎంలదేనన్నారు. పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇందుకు ఎస్ఎంసీ నిధులు వినియోగించాలనిహెచ్ఎంలకు సూచించారు. టెన్త్‌లో గత విద్యా సంవత్సరంలో 90.80 శాతం ఉత్తీర్ణత సాధించామని, ఈ విద్యా సంవత్సరంలో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఎకడమిక్ ప్లాన్ రూపొందించినట్లు చెప్పారు. 1718 ఉపాధ్యాయ ఖాళీలు జిల్లాలో 1718 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని డీఈఓ చెప్పారు. ఇందులో 219 బ్యాక్లాగ్ పోస్టులన్నారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 163 పాఠశాలలు అప్‌గ్రేడ్ చేసినట్లు చెప్పారు. ఏజెన్సీలో 26 కొత్త పాఠశాలలు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో ఆర్వీఎం పథకంలో 65 పాఠశాలలకు కొత్త భవనాలు మంజూరయ్యాయని, రెండో విడతలో 21 భవనాలు మంజూరయ్యాయని చెప్పారు. వీటిలో 15 భవనాలు పూర్తికాగా మిగిలినవి అసంపూర్తిగా ఉన్నట్లు చెప్పారు. మూడో విడతలో 151 పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 1674 పాఠశాలల్లో వంటషెడ్లు జిల్లాలో 4174 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 1674 పాఠశాలకు వంటషెడ్లు ఉన్నాయని డీఈఓ చెప్పారు. తొలివిడతలో మ రో 1605 పాఠశాలలకు షెడ్లు మంజూరు చేశామని, వీటిలో 675 పూర్తయ్యాయన్నారు. రెండో విడత 868 షెడ్లకు రూ.1.5 లక్షలు చొప్పున మంజూరు చేసినట్లు చెప్పారు. మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం అందేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థి స్థాయినబట్టి బోధన ఉండాలి విద్యార్థుల గ్రాహక స్థాయిని బట్టి బోధన చేయాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతుల ద్వారా విద్యనందించాలని డీఈఓ ఎం.వెంకటకృష్ణారెడ్డి సూచించారు. మాడుగుల ఆర్సీఎం బాలికోన్నత పాఠశాలలో పాడేరు డివిజన్ పరిధిలోని హెచ్ఎంలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో హెచ్ఎంలతో కలిసి ఉపాధ్యాయులంతా టీమ్‌గా ఏర్పడి పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోళెం సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
అభివృద్ధికి ప్రతిఒక్కరూ పాటుపడాలి
- ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: ఎంతో నమ్మకంతో ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి ఒక్కరూ వారివారి ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పుంగనూరు మున్సిపల్ కార్యాలయం లో చైర్మన్ షమీమ్‌షరీఫ్, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాద వ్, ఎంపీపీ నరసింహులు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణంతో కలసి ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులంద రూ ప్రతిరోజు తమ తమ ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరి ష్కరించాలని సూచించారు. గ్రామాల్లో మంచినీటి సమస్య, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే గ్రామాల్లో సిమెంటు రోడ్లు, కాలువల నిర్మాణం, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశాల్లో ప్రజాప్రతినిధులంతా అధికారులతో కలసి చర్చలు జరపా లని, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులు చేపట్టేందు కు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టింపులకు, భేషజాలకు వెళ్లకుండా ఐకమత్యంతో అభివృద్ధే ఆశయంగా కృషి చేయాలన్నారు. అలాచేస్తే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తామని తెలిపారు. అప్పటికీ అవసరమైతే భాస్కర్‌రెడ్డి ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడతామ ని ఆయన తెలిపారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాం తాల్లో అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరా రు. అభివృద్ధి పనులకు నిధుల కొరత ఉండదని ఈ విషయంలో ప్రజాప్రతినిధులు అపోహలకు గురికావద్దని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జెడ్పీటీసీ వెం కటరెడ్డి యాదవ్ తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ ఆవుల అమరేం ద్ర, కౌన్సిలర్లు ఇబ్రహిం, అమ్ము, రెడ్డిశేఖర్, మనోహర్, రేష్మ, మంజుల, కమలమ్మ, జయలక్ష్మితో పాటు నేతలు రెడ్డెప్ప, అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, గంగి రెడ్డి, క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలతో‘రణం’
నూతన పాలకవర్గాలకు సమస్యల స్వాగతం జిల్లా అంతటా తాగునీటి సమస్య అధ్వానంగా డ్రెయిన్లు, అంతర్గత రోడ్లు మచిలీపట్నం : ఎట్టకేలకు పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు గురువారం నుంచి కొలువుదీరనున్నాయి. జిల్లాలోని ఎనిమిది పురపాలక సంఘాలను గత మూడున్నర సంవత్సరాలుగా ప్రత్యేకాధికారులే పాలిం చారు. సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో పాలన కుంటుపడింది. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నందిగామ, ఉయ్యూరు, తిరువూరు నగర పంచాయతీల్లో తొలిసారిగా పాలకవర్గాలు పాలనా పగ్గాలు చేపట్టనున్నాయి. ప్రతి పురపాలక సఘంలోనూ తాగునీరు, డ్రెయినేజీ, అంతర్గత రహదారులు, డంపింగ్ యార్డులు, దోమల బెడద వంటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి తాగునీరు కలుషితమవుతోంది. జగ్గయ్యపేట, తిరువూరు వంటి పురపాలక సంఘాలకు నూతన పైప్‌లైన్ నిర్మాణం కలగానే మిగిలిపోయింది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లు, డ్రెయినేజీలు ఏకమై మురుగునీరు రోడ్లపైనే ప్రవహించటం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో కొలువుదీరుతున్న నూతన పాలకవర్గాలకు ప్రధాన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఉయ్యూరు నగర పంచాయతీలో తాగునీరు ప్రధాన సమస్యగా మారింది. నివేశనా స్థలాల కోసం వందలాది కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఈ పురపాలక సంఘానికి సొంత భవనం లేదు. అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ సమస్య పట్టణవాసులను ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరువూరు నగర పంచాయతీలోనూ తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. రూ.100 కోట్ల అంచనాలతో కృష్ణానది నంచి పైప్‌లైన్ నిర్మాణానికి అంచనాలు రూపొందించి అనుమతి కోసం పంపారు. ఈ ప్రతిపాదనలు కాగితాలను దాటడం లేదు. పురపాలక సంఘానికి కార్యాలయం నిమిత్తం రూ.50 లక్షలతో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ పనులు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. డ్రెయినేజీ సమస్యతోపాటు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు లేరు. నందిగామ నగర పంచాయతీలో మునేరు నుంచి పట్టణంలోకి తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. దీంతో గత నెల రోజులుగా పట్టణవాసులకు తాగునీటి సరఫరా చేయలేని దుస్థితి నెలకొంది. అంతర్గత రహదారులు దారుణంగా ఉన్నాయి. పురపాలక సంఘానికి కార్యాలయ భవనం లేదు. సిబ్బంది కొరత ఉంది. గుడివాడలో పురపాలక సంఘ నూతన భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. చాలా సంవత్సరాల క్రితం నిర్మించిన పైపులైన్లు లీకవుతూ తాగునీరు కలుషితమవుతోంది. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. నూతనంగా నిర్మించిన కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కలగానే మిగిలింది. పెడన పురపాలక సంఘంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. రూ.2 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించేందుకు రూపొందిం చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ ఇబ్బందికరంగా మారింది. డంపింగ్ యార్డు అవసరం. ఎన్టీఆర్ కాలనీ, వైఎస్సార్ కాలనీ, బ్రహ్మపురం తదితర ప్రాంతాల్లో తాగునీరుతోపాటు అనేక సమస్యలు తిష్టవేశాయి. జగ్గయ్యపేటలో తాగునీటి సమస్య పరిష్కారానికి ముక్త్యాల నుంచి 9 కిలో మీటర్ల మేర పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినా కార్యరూపం దాల్చలేదు. పట్టణం నడిబొడ్డున ఉన్న చెరువు అభివృద్ధికి నోచుకోవటం లేదు. డంపింగ్‌యార్డు సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంది. నూజివీడులో రూ.66 కోట్లతో నిర్మిస్తున్న పైప్‌లైన్ పనులు పూర్తికావాల్సి ఉంది. విజయవాడ సమీపంలోని గొల్లపూడి నుంచి నూజివీడు వరకు ఈ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. మచిలీపట్నంలో డ్రెయినేజీ సమస్య ప్రధానంగా ఉంది. తరకటూరు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నుంచి మచిలీపట్నం పుట్లమ్మచెరువు వరకు 11.5 కిలోమీటర్ల మేర తాగునీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతోంది. రూ. 80 కోట్లతో ప్రారంభించిన ఓపెన్ డ్రెయినేజీ పనులు కూడా నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయి. డంపింగ్‌యార్డు సమస్య ఉంది. -
తాగునీటి ఎద్దడిపై సభ్యుల ఆగ్రహం
సమస్య పరిష్కరించాలని డిమాండ్ చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : నగరంలో నానాటికీ జఠిలమవుతున్న తాగునీటి సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నగరసభ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నిర్వహించిన నగరసభ సర్వసభ్య సమావేశంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. చైర్పర్సన్ లీలావతి మాట్లాడుతూ.. చిక్కబళ్లాపురానికి ప్రధాన తాగునీటి వనరుగా ఉన్న జక్కలమడుగు జలాశయం నుంచి మే నెల చివరి వరకూ నీరు అందాల్సి ఉందని తెలిపారు. అయితే జలాశయం ఏప్రిల్ మొదటి వారానికి ఖాళీ అయిందని, ఈ జలాశయం నుంచి 33 శాతం నీరు దొడ్డబళ్లాపురానికి వెళుతోందని తెలిపారు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లో ఫుట్‌బాల్‌ను రెండున్నర అడుగులు పెంచినందున నిర్ణీత శాతానికన్నా ఎక్కువగా నీరు ఆ ప్రాంతానికి వెళుతోందని, ఫలితంగా చిక్కబళ్లాపురానికి నీరు తక్కువగా అందుతోందని రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఈ విషయంపై నీటి సరఫరా అధికారిని సభ్యులు నిలదీశారు. నగరసభ కమిషనర్ మునిశామప్ప జోక్యం చేసుకుని మాట్లాడుతూ.. జిల్లాకు నీరు తక్కువగా వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు సైతం వివరించడం జరిగిందని గుర్తు చేశారు. కమిషనర్ సమాధానంతో సభ్యులు మహకాళీబాబు, కిసాన్ కృష్ణప్ప, శ్రీనివాస్ తదితరులు ఏకీభవించలేదు. దొడ్డబళ్లాపురం పంప్‌హౌస్‌లోని ఫుట్‌బాల్‌ను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారికంగా ఈ చర్యను చేపట్టకపోతే గురువారం ఉదయం సభ్యులే అక్కడికెళ్లి ఫుట్‌బాల్‌ను పూర్తిగా తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షురాలు జబీన్‌తాజ్, సభ్యులు ఎ.బి.మంజునాథ్, రఫీక్, నిర్మల ప్రభు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి
బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని, ఈ సమస్య పరిష్కారంలో రాజకీయాలు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ ఆదేశించారు. ఆయన శనివారం స్థానిక జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాగునీటి సమస్య నెలకొన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనుల్లో ఎలాంటి జాప్యం, రాజకీయాలు చేయకుండా ఎక్కడ లోపాలున్నది అధికారులు పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం ఉన్న చోట తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. తాగునీటిని అందించడంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై జెస్కాం అధికారులు కూడా ముందు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే స్పందించాలని సూచించారు. తాగునీటి సమస్య ఉద్భవించి ప్రజలు హాహాకారాలు చేస్తే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బళ్లారిలో కూడా వారానికి రెండు సార్లు నీరు అందించేలా సిటీ కార్పొరేషన్, జలమండలి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అల్లీపురం, మోకా రిజర్వాయర్లకు నూతన పైప్‌లైన్ ద్వారా నీటిని సేకరించే ప్రక్రియ జరుగుతున్నందున నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా ప్రతినిధులు ప్రజలచే చీవాట్లు తినాల్సి వస్తుందని గ్రహించాలన్నారు. నగరంలోని ఏ ప్రాంతంలోనూ విద్యుత్ కోత లేకుండా జెస్కాం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అనధికారికంగా ఎప్పుడూ కోత విధించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ సలావుద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జూన్ నుంచి జనసంపర్క సమావేశాలు : జిల్లాలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలు విన్నవించుకునేందుకు జూన్ నెల నుంచి ఆయా గ్రామ పంచాయతీ స్థాయిలో జనసంపర్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతినిత్యం రెండు మూడు గ్రామాల్లో ఈ జనసంపర్క సమావేశాలు చేపడతామన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న 219 గ్రామాలలో మొదటి దశలో 102 గ్రామాలలో రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తాలూకాలోని జానెకుంటె, మారుతీ క్యాంపు, తిరుమలనగర్‌లలో రూ.2కు 20 లీటర్ల రక్షిత మంచినీటిని అందించే ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టామని, దీన్ని అన్ని గ్రామాలకు విస్తరించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. -
జగన్‌కు ఎవరూ సాటిరారు
దుష్టపాలనకు స్వస్తి పలకండి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి రామసముద్రం/ మదనపల్లె, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఏ నాయకుడూ సాటిరారని, ఆయన ప్రజల మనిషని వైఎస్సార్ సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రామసముద్రం, చెంబకూ రు తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించా రు. రోడ్డు పొడవునా మహిళలు కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన పేరును చెరిపేసేందుకు కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువ కావాలంటే ఒక్క జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. రామసముద్రం మండలంలో 1000 అడుగుల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని ఇంతకాలం ఉన్న ఎమ్మెల్యేలు తాగునీటిపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంపీ అయిన వెంటనే ప్రతి గ్రామంలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే హంద్రీ-నీవా పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. మైనార్టీలను చీల్చేందుకు కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు మదనపల్లె, పీలేరులో మైనార్టీలకు టికెట్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. విభజనవాదుల మాయమాటలను నమ్మవద్దని, సువర్ణ పాలన కోసం ఫ్యాను గుర్తుపై ఓట్లువేసి తనను, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, మండల పరిశీలకులు చిప్పిలి జగన్నాథరెడ్డి, మండల కన్వీనర్ శ్రీనాథరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పీ.కేశవరెడ్డి, యూత్ అధ్యక్షుడు విజయ్గౌడు, మదనపల్లె సీనియర్ నాయకులు ఎన్.బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.మస్తాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎన్.ఇఫ్రాన్ఖాన్, జెడ్పీటీసీ అభ్యర్థి సీహెచ్.రామచంద్రారెడ్డి, బయ్యారెడ్డి, అడవిలోపల్లె గోపాల్‌రెడ్డి, భాస్కర్‌గౌడు, సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మస్తాన్ పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి రోడ్‌షోకు అశేష జనం మదనపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోకు భారీగా జనం తరలివచ్చారు. రామసముద్రం మండలంలో రోడ్‌షోను ప్రారంభిం చిన ఆయన చెంబకూరు, కట్టుబావి, పెంచుపాడు, బొమ్మనచెరువు, కొత్తపల్లె మీదుగా మదనపల్లెకు చేరుకున్నారు. మాలిక్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మైనార్టీల సమావేశంలో ప్రసంగించారు. అనంతరం నిమ్మనపల్లె మండలంలో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం తిరిగి మదనపల్లెకు చేరుకుని నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్, టౌన్‌బ్యాంక్ సర్కిల్, అవెన్యూరోడ్, ఎంఎస్ఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె వరకు రోడ్‌షో నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మిథున్‌రెడ్డికి, తిప్పారెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. -
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎమ్మార్‌పల్లె కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్లు వైఎస్ఆర్ సీపీలో చేరిక తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతానని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు వెంకటమునిరెడ్డి, తిరుమలయ్య, మబ్బు నాదమునిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎంఆర్‌పల్లె మాజీ కాంగ్రెస్ వార్డు మెంబర్లతో పాటు వందలాది మంది యువత ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంఆర్‌పల్లె పరిధిలోని ఎస్వీనగర్ వద్ద పార్టీ నాయకుడు ఎంవీఎస్.మణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో, శ్రీనివాసనగర్‌లో పార్టీ నాయకుడు యేసు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా చెయ్యి చెయ్యి కలిపి ఏకమై వైఎస్ఆర్ సీపీని గెలిపించుకుని తిరుపతి పుణ్యక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో తాను గెలుపొందినప్పటి నుంచి కంటిపై కునుకు లేకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. టీడీపీలోలాగా వైఎస్ఆర్ సీపీలో వర్గాలు, కుమ్ములాటలు ఉండవన్నారు. వైఎస్ఆర్ సీపీ క్రమశిక్షణకు మారు పేరు అన్నారు. పార్టీలోని నాయకులు, కార్యకర్తలంతా ఒక్కటిగా ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి వెంటనే కృషి చేస్తామన్నారు. తండ్రి ఆశయసాధన, ప్రజల అభ్యున్నతికై జగనన్న పడుతున్న శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తించి రాబోయే ఎన్నికల్లో వైఎసార్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జగనన్న అధికారంలోకి రాగానే మహానేత వైఎస్. రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పథకాలకన్నా మరిన్ని ఎక్కువగా ప్రవేశపెడతారని స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి సోదరి భూమన సుగుణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పే నాయకులను నమ్మవద్దని ప్రజలకోసం పనిచేసే కరుణాకరరెడ్డి వంటి నాయకుడిని ఆదరించి గెలిపిం చాలని కోరారు. పార్టీ నాయకులు ఎస్కే. బాబు, కట్టా జయరాంయాదవ్, సాకం ప్రభాకర్, ముద్రనారాయణ, మునిసుబ్రమణ్యం, లక్ష్మి, సుభాషిణి, పార్టీలో చేరిన వారు పి. సుబ్రమణ్యం, ఎ. సుధాకర్, మోహనయ్య, రమణయ్య, సోమశేఖర్, సుమంత్, మురళి, రాజగోపాల్, నాగేశ్వరరావు, జయప్రకాష్, లోకనాధం, సతీష్‌బాబు, మౌనిక, నాగమణితో పాటు వందలాది మంది యువత ఉన్నారు. -
త్వరితగతిన ఎత్తినహొళె
నిర్మాణ అంచనా రూ.12,912 కోట్లు : సీఎం ఏడు జిలాల్లో తీరనున్న తాగునీటి సమస్య 1500 అడుగుల లోతుకు పడిపోయిన భూగర్భజలాలు ‘పరమ శివయ్య’ నివేదికనూ అమలు చేస్తాం పడమటి కనుమల నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రం పాలు ఎత్తినహొళె ద్వారా కేవలం 24 టీఎంసీలు మాత్రమే త రలింపు చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : ఎత్తినహొళె పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి కోలారు, చిక్కబళ్లాపురం, రామనగర, బెంగళూరు గ్రామీణ జిల్లాలతో పాటు హాసన, తుమకూరు, చిక్కమగళూరు జిల్లాలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. నగరంలోని బీజీఎస్ పాఠశాల ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఎత్తినహొళెకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ ప్రాంతంలో భూగర్భజలాలు 1200 అడుగుల నుంచి 1500 అడుగుల లోతుకు పడిపోయాయని తెలిపారు. నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్నందున ఎత్తినహొళె పథకం ద్వారా 15 టీఎంసీల తాగు నీటిని, చెరువులను నింపేందుకు మరో తొమ్మిది టీఎంసీల నీటిని తరలిస్తామని వెల్లడించారు. కోలారు, చిక్కబళ్లాపురం జిల్లాల్లోని చెరువులను నింపి భూగర్భ జలాలు వృద్ధికి ప్రయత్నిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పరమ శివయ్య కమిటీ సమర్పించిన నివేదికను కూడా అమలు చేస్తామని ప్రకటించారు. ఎత్తినహొళె ద్వారా కేవలం 24.01 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తామని, అదీ కేవలం వరా ్షకాలంలో మాత్రమేనని తెలిపారు. పడమటి కనుమల నుంచి సుమారు మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, అందులో కేవలం 24 టీఎంసీలను మాత్రమే ఈ ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. దక్షిణ కన్నడ జిల్లా ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ మాట్లాడుతూ ఇది నేత్రావతి మళ్లింపు పథకం కాదని స్పష్టం చేశారు. ఇందులో రాజకీయం లేదని, తాను గత అయిదు సంవత్సరాల నుంచి ఎత్తినహొళె పథకం గురించి అధ్యయనం చేశానని తెలిపారు. రెండేళ్లలో పథకాన్ని పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. జల వనరుల శాఖ మంత్రి ఎంబీ.పాటిల్ మాట్లాడుతూ ఈ పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందన్నారు. రూ.12,912.36 అంచనా వ్యయంతో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. ఆది చుంచనగిరి మఠాధిపతి నిర్మలానంద స్వామీజీ మాట్లాడుతూ ఈ పథకం పూర్తయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇదే స్థలంలో ఘనంగా సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రామలింగారెడ్డి, కృష్ణ బైరేగౌడ, టీబీ. జయచంద్ర, రోషన్‌బేగ్, శాసన సభ డిప్యూటీ స్పీకర్ శివశంకర రెడ్డి, కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ, కేహెచ్. మునియప్ప, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రమేశ్ కుమార్, సుబ్బారెడ్డి, జేకే. కృష్ణారెడ్డి, రాజన్న, కలెక్టర్ ఆర్. విశాల్ పాల్గొన్నారు. -
బాబు ఎన్నికల వల
-
ఎన్నికల వల
*కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తొలిరోజు పర్యటన *ఇల్లిల్లూ తిరిగి ఓటర్లను ఆకట్టుకునే యత్నం సాక్షి, చిత్తూరు: ఓటర్లకు గాలం వేసే దిశగా చంద్రబాబునాయుడు తొలిరోజు పర్యటన సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలంటూ సభల్లో పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం విచ్చేశారు. ఉదయం సిద్దావూరు, శాంతిపురం, వెంకటేపల్లె, బోయనపల్లె, రామకుప్పంలో విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఎన్ని జన్మలు ఎత్తినా కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనని, మళ్లీ ఈ సారి అత్యధిక మెజారిటీతో తనను దీవించాలని పదేపదే ఓటర్లను ప్రాధేయపడ్డారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు చోటు లేకుండా చూడాలని ఉపన్యాసంలో తరచూ అభ్యర్థించారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్య, ఇజ్రాయిల్ ప్రాజెక్ట్, 2కేఆర్ ప్రాజెక్ట్ గురించి అన్ని చోట్లా ప్రస్తావించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇది ప్రమాదమకరమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. అలాగే కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి సవాల్ ముఖ్యమంత్రికి దమ్ముంటే కుప్పంలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించి రచ్చబండ నిర్వహించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. కృష్ణగిరి, పలమనేరు రహదారులను తాను జాతీయ రహదారులుగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదని విమర్శించారు. మాట్లాడిన ప్రతి సభలోనూ రేపోమాపో జగన్ ఇక్కడకు వస్తాడు, మీరు అతని మాటలు నమ్మవద్దు, అలాంటి వారిని రానివ్వదు అంటూ ప్రజలను అభ్యర్థించారు. నియోజకవర్గంలో నీటి సమస్య పరిష్కారమయ్యే వరకు కుప్పం ఎమ్మెల్యేగా తాను పోరాడతానని, అవసరమైతే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బోయనపల్లెలో ఎక్కువ సమ యం కేటాయించి సామాన్య కార్యకర్తలాగా ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చంద్రబాబు 21వ తేదీ తిరుపతి సభకు జనసమీకరణ పనుల్లో నేతలు నిమగ్నమయ్యారు. దీంతో బాబు తొలిరోజు పర్యటనలో నేత లు, కార్యకర్తలు, ప్రజల సందడి తక్కువగా కనిపించింది. శాంతిపురం సభ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడడంతో పెద్దగా జనం కనిపించలేదు. అలాగే బాబు తన ప్రసంగంలో ఎక్కువసార్లు ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేస్తూ పరోక్షంగా ఓట్లు అభ్యర్థించడం కనిపించింది. గతంలో తనను 40 వేలు, 60 వేలు, 70 వేల మెజారిటీ ఓట్లతో గెలిపించారని, ఈ సారి అంతకన్నా ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ప్రజల ను అభ్యర్థించారు. శాంతిపురంలో స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలను ప్రస్తావించారు. రామకుప్పంలో ఏవైనా సమస్యలున్నాయని అని అడిగి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. వారు అడిగిన ఆర్టీసీ బస్సులు, ఇతర సమస్యలను పరిష్కరిస్తానని, రేపే అధికారులతో మాట్లాడతానని పేర్కొనడం గమనార్హం. సుమారు పదిహేను నెలల తర్వాత కుప్పం నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబు ఆ ప్రభావం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. తాను ఆరు నెలలకోసారి రావాలనుకున్నా ఈసారి జాప్యం జరిగిందని ముందే పే ర్కొంటూ ఉపన్యాసం ప్రారంభించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కుప్పం వస్తానని, ఎన్నికలు జరిగిన తర్వాత సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తానని వాగ్దానంచేశారు. ఆయా గ్రామాల్లో స్థానిక కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, పార్టీ గెలిపించాలని వారికి వ్యక్తిగతంగా హితబోధ చేయడం గమనార్హం. చంద్రబాబు నేరుగా చెప్పకనే చెబుతూ కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం మీద బాబు పర్యటన వాహనాల సంఖ్య ఎక్కువ, కార్యకర్తల హడావుడి తక్కువ అన్నట్లు సాగింది. శాంతిపురం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. నీటి కోసం తాము పడుతున్న అగచాట్లు వివరించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.