జగన్‌కు ఎవరూ సాటిరారు
- దుష్టపాలనకు స్వస్తి పలకండి
- ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం
- రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి
రామసముద్రం/ మదనపల్లె, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ఏ నాయకుడూ సాటిరారని, ఆయన ప్రజల మనిషని వైఎస్సార్ సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రామసముద్రం, చెంబకూ రు తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించా రు. రోడ్డు పొడవునా మహిళలు కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన పేరును చెరిపేసేందుకు కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువ కావాలంటే ఒక్క జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. రామసముద్రం మండలంలో 1000 అడుగుల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని ఇంతకాలం ఉన్న ఎమ్మెల్యేలు తాగునీటిపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు.
స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంపీ అయిన వెంటనే ప్రతి గ్రామంలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే హంద్రీ-నీవా పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. మైనార్టీలను చీల్చేందుకు కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు మదనపల్లె, పీలేరులో మైనార్టీలకు టికెట్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
విభజనవాదుల మాయమాటలను నమ్మవద్దని, సువర్ణ పాలన కోసం ఫ్యాను గుర్తుపై ఓట్లువేసి తనను, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, మండల పరిశీలకులు చిప్పిలి జగన్నాథరెడ్డి, మండల కన్వీనర్ శ్రీనాథరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పీ.కేశవరెడ్డి, యూత్ అధ్యక్షుడు విజయ్‌గౌడు, మదనపల్లె సీనియర్ నాయకులు ఎన్.బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.మస్తాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎన్.ఇఫ్రాన్‌ఖాన్, జెడ్పీటీసీ అభ్యర్థి సీహెచ్.రామచంద్రారెడ్డి, బయ్యారెడ్డి, అడవిలోపల్లె గోపాల్‌రెడ్డి, భాస్కర్‌గౌడు, సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మస్తాన్ పాల్గొన్నారు.
మిథున్‌రెడ్డి రోడ్‌షోకు అశేష జనం
మదనపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోకు భారీగా జనం తరలివచ్చారు. రామసముద్రం మండలంలో రోడ్‌షోను ప్రారంభిం చిన ఆయన చెంబకూరు, కట్టుబావి, పెంచుపాడు, బొమ్మనచెరువు, కొత్తపల్లె మీదుగా మదనపల్లెకు చేరుకున్నారు. మాలిక్ ఫంక్షన్ హాల్‌లో ముస్లిం మైనార్టీల సమావేశంలో ప్రసంగించారు. అనంతరం నిమ్మనపల్లె మండలంలో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం తిరిగి మదనపల్లెకు చేరుకుని నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్, టౌన్‌బ్యాంక్ సర్కిల్, అవెన్యూరోడ్, ఎంఎస్‌ఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె వరకు రోడ్‌షో నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మిథున్‌రెడ్డికి, తిప్పారెడ్డికి హారతులతో స్వాగతం పలికారు.