వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లనున్న సోనియా గాంధీ!
వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లనున్న సోనియా గాంధీ!
Published Sun, Sep 1 2013 10:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం అమెరికాకు వెళ్లనున్నారని పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు మీడియాకు వెల్లడించారు. వైద్య పరీక్షల నిమిత్తమే సోనియా అమెరికా వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకుడు తెలిపారు. మిగితా వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. గత ఆరునెలల్లో సోనియా అమెరికాకు వెళ్లడం ఇది రెండవసారి.
వైద్య పరీక్షల నిమిత్తం 2011 ఆగస్టులో, గత సంవత్సరం సెప్టెంబర్ 2 తేదిన, గత ఫిబ్రవరిలో సోనియా అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా అనారోగ్యానికి లోనవ్వడంతో ఆగస్టు 26 తేదిన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు గంటల వైద్య పరీక్షల తర్వాత సోనియాను డిశ్చార్జి చేశారు.
Advertisement
Advertisement