
భారత్‌కు తిరిగొచ్చిన సోనియా
న్యూఢిల్లీ: సాధారణ వైద్య పరీక్షల కోసం ఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ భారత్‌కు తిరిగి వచ్చారు. కుమార్తె ప్రియాంకాగాంధీతో కలిసి సోనియా అమెరికాలో వైద్య పరీక్షల కోసం వెళ్లారు. కాగా, ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల వ్యతిరేక అల్లర్లలో ప్రమేయమున్న పార్టీ నేతలను కాపాడుతున్నారనే ఆరోపణలపై సోనియాపై న్యూయార్క్ కోర్టులో దాఖలైన కేసుకు సంబంధించిన సమన్లను ఆమెకు పిటిషనర్లు పంపారు. న్యూయార్క్‌లో సోనియా చేరిన స్లోన్-కెట్టరింగ్ మెమోరియల్ ఆస్పత్రి నైట్‌షిఫ్ట్ సూపర్‌వైజర్‌కు సమన్ల కాపీ, ఫిర్యాదు, కోర్టు ఉత్తర్వులను అందించినట్లు సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రతినిధులు తెలిపారు. వాటిని సోనియాకు ఇవ్వాల్సిందిగా కోరినట్లు చెప్పారు.