మీ వల్లే మాల్యా స్వేచ్ఛగా పారిపోయాడు! | Vijay Mallya was permitted to go scot free, says Congress | Sakshi
Sakshi News home page

మీ వల్లే మాల్యా స్వేచ్ఛగా పారిపోయాడు!

Published Sun, May 1 2016 7:19 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

మీ వల్లే మాల్యా స్వేచ్ఛగా పారిపోయాడు! - Sakshi

మీ వల్లే మాల్యా స్వేచ్ఛగా పారిపోయాడు!

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి.. ప్రస్తుతం విదేశాల్లో తిష్టవేసిన వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా వ్యవహారంలో నరేంద్రమోదీ సర్కార్‌పై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు ముందుగానే ఉప్పందించి, అనుమతించడం వల్లే విజయ్‌ మల్యా దర్జాగా దేశం నుంచి పారిపోయి, బ్రిటన్‌లో నివాసముంటున్నాడని కాంగ్రెస్‌ పార్టీ నేత రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు.

ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో దావానలాన్ని అణచడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణ విపత్తు అయిన ఈ కార్చిచ్చును ఆర్పడంలో మోదీ సర్కార్ సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement