
'షారూఖ్ ను ఎందుకు ప్రశ్నించారు?'
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ పాలనలో పెరిగిపోతున్న మత అసహనంపై మాట్లాడినందుకే బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) టార్గెట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్‌ఎస్‌పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో షారూఖ్ ను మంగళవారం ఈడీ ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా ట్విటర్ లో స్పందించారు.
'దీపావళి రోజున షారూఖ్ ను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ప్రశ్నించారా లేక మనసులో ఉన్నది ఆయన మాట్లాడారని టార్గెట్ చేశారా? ప్రభుత్వ ప్రతీకారం చర్యలకు ఈడీ కొత్త ఆయుధంగా మారిందా?' అని ఆయన ప్రశ్నించారు. దేశంలో సీనియర్ మోస్ట్ సీఎం అయిన హిమచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పట్ల కూడా ఈడీ అనుచితంగా ప్రవర్తించిందని ఆరోపించారు. వీరభద్ర సింగ్ కుమార్తె వివాహం జరిగిన మరుసటి రోజే ఆయన నివాసంలో ఈడీ సోదాలు చేసిందని గుర్తు చేశారు.
Shah Rukh questioned by ED on Diwali. Is it for Forex violation or for speaking from his heart? Is ED the new Revenge Settlement Authority?
— Randeep S Surjewala (@rssurjewala) November 11, 2015