షారుఖ్కు ఈడీ సమన్లు | ED summons Shah Rukh Khan over sale of KKR shares | Sakshi
Sakshi News home page

షారుఖ్కు ఈడీ సమన్లు

Published Wed, Oct 28 2015 2:09 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM

షారుఖ్కు ఈడీ సమన్లు - Sakshi

షారుఖ్కు ఈడీ సమన్లు

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్‌ఎస్‌పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. 2008-09లో జరిగిన ఈ షేర్ల అమ్మకానికి సంబంధించి ఈడీ 2011లో సమన్లు జారీ చేసింది. ‘షారుక్‌కు సమన్లు పంపడం ఇది మూడోసారి.

కాబట్టి అతను ఏ క్షణమైనా విచారణకు హాజరుకావొచ్చు. అతని నుంచి కొంత సమాచారం తెలుసుకోవాల్సి ఉంది’ అని ఈడీ వర్గాలు తెలిపాయి. షేర్ల అమక్మంలో జై మెహతాకు చెందిన సీ ఐలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ విలువను ఎనిమిది, తొమ్మిది రెట్లు తక్కువగా చూపారని ఈడీ విచారణ జరుపుతోంది. రూ. 70-86  విలువగల ఈక్విటీ షేర్లను సీ ఐలాండ్‌కు కేవలం రూ. 10లకే కేటాయించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement