షారుక్ ఖాన్‌ను ప్రశ్నించిన ఈడీ
ముంబై: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు ఆయనను విచారించారు. అయితే తాను ఎటువంటి ఆర్థిక అక్రమాలకు పాల్పడలేదని షారూఖ్ చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఆర్‌ఎస్‌పీఎల్) షేర్లను మారిషస్‌కు చెందిన జై మెహతా కంపెనీకి అమ్మడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ షారూఖ్ కు మూడుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. 2008-09లో జరిగిన ఈ షేర్ల అమ్మకానికి సంబంధించి ఈడీ తొలిసారిగా 2011లో సమన్లు పంపింది.
షేర్ల అమక్మంలో జై మెహతాకు చెందిన సీ ఐలాండ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ విలువను ఎనిమిది, తొమ్మిది రెట్లు తక్కువగా చూపారని ఈడీ విచారణ జరుపుతోంది. రూ. 70-86 విలువగల ఈక్విటీ షేర్లను సీ ఐలాండ్‌కు కేవలం రూ. 10లకే కేటాయించారని ఈడీ తన నివేదికలో పేర్కొంది.