
బాలీవుడ్ హీరో హీరోయిన్లకు ఈడీ నోటీసులు
ఫెమా (ఫారిన్ ఎక్స్చేంజి మేనేజ్‌మెంట్) నిబంధనల ఉల్లంఘన కేసులో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్‌లతో పాటు హీరోయిన్ జూహీ చావ్లాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
షారుక్, జూహీ చావ్లాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ జట్టు యజమానులన్న విషయం తెలిసిందే. ఇప్పుడు నైట్‌రైడర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు వీళ్లు ముగ్గురికీ నోటీసులు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ చట్టంలోని 4(1) నిబంధన కింద ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.