ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీకి సంబంధించి బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరి, నటి జుహీ చావ్లాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్
ముంబై: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీకి సంబంధించి బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, ఆయన భార్య గౌరి, నటి జుహీ చావ్లాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం షోకాజ్ నోటీసులిచ్చింది. ఫెమా చట్టం నిబంధనలు ఉల్లంఘించి రూ.73.6 కోట్ల విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోయేందుకు వారు కారణమయ్యారంటూ నోటీసులు పంపింది.
15 రోజుల్లో సమాధానం చెప్పాలంది. ఈ కేసు 2008–09 కాలానికి చెందినది. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మాతృసంస్థ అయిన కేఆర్‌ఎస్‌పీఎల్‌కు చెందిన 90 లక్షల షేర్లను మారిషస్‌కు చెందిన మరో సంస్థకు వీరు షేరు రూ.10కే ఇచ్చారు. కానీ అప్పటికి కేఆర్‌ఎస్‌పీఎల్ ఒక్కో షేర్ విలువ రూ.86 నుంచి రూ.99 మధ్య ఉంది.