సోషల్ మీడియాలో దుమ్మురేపుతోన్న ‘మోదీ, రాహుల్ మిమిక్రీ’ వీడియోను టీవీలో ప్రసారం చేయకపోవడంపై వివాదం రాజుకుంది. ఆఖరికి కామెడీ షోలపైనా నెన్సార్‌షిప్ విధిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన చేసిన ట్వీట్ వైరల్ అయింది. అబ్‌కీ బార్ సెన్సార్‌షిప్ సర్కార్ : ‘ఇది నిషేధాజ‍్క్షల ప్రభుత్వం. పౌరులు ఏం తినాలో, ఎలాంటి దుస్తులు ధరించాలో, ఏమేమి చూడాలో.. ఆఖరికి ఎవరిని పెళ్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయింస్తుంది. ఇక ఏం ఆలోచించాలన్నది కూడా వారి నిర్దేశాన్ని బట్టే జరగాలా!’’ అని సుర్జేవాలా రాసుకొచ్చిన సుర్జేవాలా.. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నినాదమైన ‘అబ్‌కీ బార్ మోదీ సర్కార్’ నినాదాన్ని ఎద్దేవా చేస్తూ ‘అబ్‌కీ బార్ సెన్సార్‌షిప్ సర్కార్’ అని శీర్షిక ఇచ్చారు. కమెడియన్ శ్యాం రంగీలా వీడియో వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.