'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి' | Concrete action needed, not posturing: Cong tells PM | Sakshi
Sakshi News home page

'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి'

Published Wed, Oct 14 2015 2:16 PM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి'

'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి'

న్యూఢిల్లీ: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మాటలు కట్టిపెట్టి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. మోదీ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేసింది. ఆయన దేశానికి ప్రధానమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నారని విమర్శించింది. 125 కోట్ల మందిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది.

దాద్రి ఘటన జరిగిన తర్వాత యూపీ సీఎంతో ప్రధాని మాట్లాడారా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా పశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ నాయకులు సంగీత్ సోమ్ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement