Dadri lynching
-
అవును.. అది ఆవు మాంసమే!
దేశంలో 'అసహనం' వ్యాఖ్యలకు దారితీసిన దాద్రి ఘటన గుర్తుండే ఉంటుంది కదూ. యూపీలోని దాద్రి ప్రాంతంలో 50 ఏళ్ల మహ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి వద్ద ఆవుమాంసం ఉందని సుమారు 100 మంది అతడిని ఇంట్లోంచి బయటకు లాగి చంపేశారు. అప్పట్లో పోలీసులు అతడి ఇంటివద్ద చెత్తకుండీలో ఉన్న మాంసం శాంపిళ్లను సేకరించారు. అది 'మటన్' అని, బీఫ్ కాదని స్థానిక వైద్యుడు ఒకరు చెప్పారు. కానీ.. ఆ ఘటన జరిగిన 8 నెలల తర్వాత ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది. అక్కడ లభించింది. ఆవు లేదా దూడ మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో వెల్లడైంది. తొలుత అది మటన్ అనే తాము భావించామని, కానీ తర్వాత అది ఆవుమాంసం అన్న విషయం తేలిందని యూపీ డీజీపీ జావేద్ అహ్మద్ తెలిపారు. యూపీలో ఆవుమాంసం తినడం నేరం కాదు గానీ, ఆవులను చంపడం మాత్రం నేరమే. అఖ్లాక్ హత్య కేసులో అరెస్టయిన 18 మందిలో స్థానిక బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. అప్పట్లో ముందు అక్కడున్నది మటన్ అని చెప్పడంతో.. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు తప్పుడు రూమర్లు ప్రచారం చేస్తూ మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. -
అది ఆవు మాంసం కాదు మేకమాంసమే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై విచారణలో సరికొత్త విషయాలు వెలుగుచూశాయి. మహమ్మద్ అఖ్లాక్ ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉన్నది మేకమాంసమే కానీ ఆవు మాంసం కాదని పశువైద్యాధికారుల నివేదికలో తేలింది. ఆవుమాంసం కలిగి ఉన్నాడని ఆరోపణలపై మహమ్మద్ అఖ్లాక్ నివాసంపై ఓ వర్గానికి చెందిన మూక దాడి చేసి.. ఆయనను కొట్టిచంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఆయన కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. కుటుంబసభ్యులు తమ ఇంట్లో ఆవుమాంసం లేదని, తాము గోమాంసాన్ని భుజించలేనది చెప్తున్నా వినకుండా కోపోద్రిక్త మూకలు అఖ్లాక్ను, ఆయన కొడుకును ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి దాడి చేశారు. అఖ్లాక్ కుటుంబం ఓ ఆవుదూడను కోసేసి.. దాని ఆహారాన్ని తిన్నారంటూ స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోని మైకుల్లో వెలువడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే దాదాపు 12మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు. కేసులు నమోదైన వారిలో స్థానిక బీజేపీ నేత కొడుకు కూడా ఉన్నాడు. అఖ్లాక్ నివాసంలో దొరికింది మేకమాంసమే కానీ ఆవుమాంసం కాదని యూపీ పశువైద్యశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించిన ఫొరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. -
దాద్రీ ఘటనపై చార్జీషీట్ దాఖలు
-
అవార్డులు వెనక్కివ్వాలా.. ఊహూ నేనివ్వను!
తిరువనంతపురం: దేశంలో జరుగుతున్న పలు ఘటనలకు నిరసనగా పలువురు రచయితలు తమకు గతంలో వచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్న విషయం ప్రముఖ నటి, నృత్యకారిణి శోభనకు అస్సలు తెలియదట. దీనికితోడు వారికి లేటు వయసులో అవార్డు వచ్చి ఉంటుంది, అందుకే ఇచ్చేశారు.. తాను మాత్రం అవార్డును తిరిగి ఇచ్చేది లేదని కుండబద్దలుకొట్టి మరీ చెప్పింది. కేరళలో జరుగుతున్న 38వ సూర్య ఫెస్టివల్ కోసం తిరువంతనపురం వచ్చినపుడు మీడియా ప్రశ్నించగా శోభన ఈ కామెంట్స్ చేసింది. యూపీలో జరిగిన దాద్రి ఉదంతం గురించి తనకు అస్సలు తెలియనే తెలియదని సెలవిచ్చింది. 'ఏ అవార్డు? అవార్డులు తిరిగి ఇచ్చారా, ఎవరు.... ఏమో నాకు తెలియదు' అంటూ తిరిగి విలేకరులకే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. దీనికి తోడు.. తాను మాత్రం తనకు వచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేది లేదని చెప్పేసరికి విలేకరులు కంగుతిన్నారట. దీనిపై ఆమెకు కొంత వివరణ ఇచ్చిన మీడియా, ఈ ఘటనలపై వ్యాఖ్యానించాలని ఇంకొంచెం ఒత్తిడి చేయగా.. బహుశా పెద్ద వయసులో వచ్చింది కాబట్టి వాళ్లు అవార్డులను తిరిగి ఇస్తున్నారేమో...తనకు వచ్చిన అవార్డును మాత్రం ఇవ్వనని కరాఖండిగా తేల్చేసిందిట. ప్రసిద్ధ కన్నడ రచయిత ఎంఎం కల్బుర్గీ హత్య, దాద్రిలో ముస్లిం వృద్ధుని హత్య నేపథ్యంలో దాదాపు 12 మంది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన నటి శోభనకు కేరళ రచయిత్రి సారా జోసెఫ్ సహా, కొంతమంది ప్రసిద్ధ రచయితలు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేయడం గురించి తెలియకపోవడం ఏంటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
'మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపాలి'
న్యూఢిల్లీ: దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలస్యంగా స్పందించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. మాటలు కట్టిపెట్టి పట్టిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించింది. మోదీ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేసింది. ఆయన దేశానికి ప్రధానమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నారని విమర్శించింది. 125 కోట్ల మందిని కాపాడాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్న విషయాన్ని గుర్తు చేసింది. దాద్రి ఘటన జరిగిన తర్వాత యూపీ సీఎంతో ప్రధాని మాట్లాడారా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా పశ్నించారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, సంజీవ్ బల్యాన్, బీజేపీ నాయకులు సంగీత్ సోమ్ తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాల్పిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు.